Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్య శిబిరాలు ఉపయోగించుకోండి
- సమావేశంలో చైర్మెన్, కమిషనర్
నవతెలంగాణ-ఇల్లందు
కంటి సమస్యలు ఉన్నవారికి ప్రభుత్వం పైసా ఖర్చు లేకుండా కంటి వెలుగు అందిస్తోందని మున్సిపల్ చైర్మెన్ వెంకటేశ్వరరావు, కమిషనర్ అంకుల్ షావలి అన్నారు. మున్సిపల్ సమావేశ మందిరంలో శుక్రవారం కంటి వెలుగు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తొలి విడత కంటి వెలుగు కార్యక్రమంలో లక్షల మందికి వెలుగు నింపారని అన్నారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని పట్టణ ప్రజలందరూ సద్వినిగం చేసుకోవాలని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కంటి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కొక్కు నాగేశ్వరరావు, డీఈ రచ్చ రామకృష్ణ, ఏఈ శంకర్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.