Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్లో ఎక్స్లెంట్ విద్యార్థి ఎండి రయ్యాన్ నజీఫ్ సత్తా చాటాడని ఎక్సలెంట్ విద్యాసంస్థల చైర్మన్ ఎండి.యూసఫ్ షరీఫ్ తెలిపారు. జనవరి 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్లో ట్రాన్స్పోర్ట్ అండ్ ఇన్నోవేషన్ విభాగంలో ఆటో లైట్ మెకానిజం ఆటో కల్వర్టు ప్రాజెక్టుకు మణుగూరు ఎక్స్ లెంట్ పాఠశాలకు చెందిన 8వ తరగతి చదువుతున్న విద్యార్థి ఎండి రయాన్ నజీఫ్కు రాష్ట్ర స్థాయి తృతీయ బహుమతి సాధించాడని అన్నారు. ఈ బహుమతిని ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ టెక్నాలజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్ జిల్లా కలెక్టర్ మశ్రఫ్ ఫారూఖ్ చేతుల మీదుగా బహుమతి అందుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్స్ యూసఫ్, గబ్బర్, ఖాదర్, ఖాన్ హర్షం వ్యక్తం చేస్తూ సైన్స్ ఫెయిర్లో విద్యార్థికి ఈ బహుమతి రావడానికి కారకులైన, ఆ విద్యార్థిని ప్రోత్సహించిన ఉపాధ్యాయులు సురేష్, వెంకట్, సుజాతలను అభినందించి పాఠశాలలో ఆ విద్యార్ధికి చిరుసత్కారం చేశారు. ఎక్స్ లెంట్ పాఠశాల సాధించిన ఈ విజయానికి పుర ప్రముఖులు, విద్యార్థుల తల్లిదండ్రులు శుభాకాంక్షలు తెలియజేశారు.