Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 13 నుండి 18 వరకు జానపద...పౌరాణిక నాటకాలు
- ఉత్సాహంగా కొత్తగూడెం క్లబ్లో ప్రతీరోజు, రాత్రి 7గంటలకు
- అందరూ ఆహ్వానితులే....
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం పట్టణంలో ప్రఖ్యాత సురభి నాటక సమాజం వారి నాటకోత్సవాలు మొదలయ్యాయి. శుక్రవారం రాత్రి నుండి లాంచనంగా ప్రారంభించారు. సుదీర్గ 138, సంవత్సరాల ఘన చరిత్ర గలిగిన శ్రీవినాయక నాట్యమండలి-సురభి 8 తరాలనుండి వారి నాటక సమాజం వారు నాటకాల ప్రదర్శని నిర్వహిస్తున్నారు. వృత్తి, ప్రవృత్తి, నాటకరంగాన్ని నమ్ముకుని అనేక కుటుంబాలకు కుటుంబాలే కళారంగానికిసేవలందిస్తున్నారు. నేటి సినీరంగానిగి ధీటుగా వీరి ప్రదర్శనలతో, ప్రజల మంత్రముగ్ధులచేస్తున్నారు. నాటినుంచి నేటితరం ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కళారంగాన్ని కాపాడుతున్న ఏకైక సంస్ధ సురభి ఒక్కటే అని చెప్పక తప్పదు. రంగస్ధలంపై, రధాలు నడవడం, వర్షం కురవడం, మంటలు లేవడం, గాలిలో ఆయుధాలు పోరాటం, ఘటోత్కజుడు, నోట లడ్డూలు పడటం, శశిరేఖ, తల్పం ఆకాశమార్గమున వెల్లడం, సూర్య అస్తమయం, పున్నమ్మ, విహరించడం, మకరితో యుద్ధం, భయంకర బూతాల, విన్యాసం, పక్షిపై, బాలవర్ధిరాజు, వెల్లడం, జింకలు, పులులు, విహరించే, మరెన్నో అధ్బుతసన్నివేశాలుతో, కనులువిరుమెట్లుగోలిపే, సీనరీలు, సెట్టింగులతో, కొత్తగూడెం ప్రజలను అలరిస్తున్నాయి.సురబి నాటక సమాజం నిర్వహకులు ,ఆర్,వేణుగోపాలరావు తెలిపారు.జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ఆదేశాల మేరకు జనవరి 13వ తేదిన మాయాబజార్,14న శ్రీశ్రీనివాసకళ్యాణం,15న పాతాళ భైరవి , 16న, భక్త ప్రహ్లాద ,17న బాలనాగమ్మ, 18న లవకుశ పౌరాణిక నాటకాలు ప్రదర్శనలు నిర్వహించనున్నారు.