Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరాశ్రయులకు ఇండ్ల స్థలాలు
- విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే వనమా
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం నియోజకవర్గంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వరాల జల్లు కురిపించడంలోతో నా కల నెరవేరిందని, సీఎం కేసీఆర్ కొత్తగూడెం నియోజకవర్గానికి సుమారు రూ.250 కోట్లు మంజూరు చేశారని, నేను అడిగినవన్నీ సీఎం ఇచ్చారని, అయినకు ఎంతో రుణపడి ఉంటానని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గురువారం కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సభలో సిఎం కొత్తగూడెం అభివృద్దికి వరాల జల్లు కురిపించారని తెలిపారు. ముఖ్యంగా కొత్తగూడెం-పాల్వంచ మున్సిపాలిటీలకు స్పెషల్ ఫండ్ క్రింద రూ.80 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. గతం కొంతకాలంగా లక్ష్మీదేవిపల్లి, పంచాయతీ పరిధిలోని మొర్రెడు వాగుకు రెండు వైపుల ఉన్న వాగు ఒడ్డు కోతకు గురవుతున్న నేపద్యంలో ఓడ్డును కోత నుండి రక్షించేందుకు వాగులకు రెండు వైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం రూ. 150 కోట్ల నిధులు విడుదల చేస్తాననడం ఆనందంగా ఉందన్నారు. ప్రజల మరొక చిరకాల కోరిక అయిన మైనింగ్ కళాశాలను పూర్తిస్థాయి ఇంజనీరింగ్ కళాశాలగా సీఎం చేస్తాను అనడం సంతోషంగా ఉందని తెలిపా రు. కొత్తగూడెం సింగరేణి ఏరియాలో ఓసి కార ణంగా, వనామా కాలనీ, ఎస్ఆర్కె నగర్, మేదర బస్తీ లో రైల్వే భూముల్లో నిర్వసితులు అయిన వారికి, జర్న లిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కొత్తగూడెం పర్యటన విజయ వంతం చేసిన ప్రజలకు, అధికా రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విలేకర్ల సమా వేశంలో జిల్లా జెడ్పీ వైస్చైర్మెన్ కంచర్ల చంద్రశేఖ ర్రావు, ఎంపిపి బాదవత్ శాంతి, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.