Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆంధ్రా ధాన్యం కొనుగోలు
నవతెలంగాణ-అశ్వారావుపేట
తెలంగాణ రైతులు పడిగాపులు పడుతుండగా మన కొనుగోలు కేంద్రంలో ఆంధ్రా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు పలువురు రైతులు వాపోతున్నారు. శుక్రవారం మండల పరిధిలోని నారాయణపురం పరపతి సంఘం పరిధిలో గుమ్మడవల్లి కొనుగోలు కేంద్రంలో సరిహద్దు గ్రామం అయిన ఓ ఆంధ్రా రైతు ధాన్యాన్ని తెలంగాణ రైతులు పేరుతో కొనుగోలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే కేంద్రంలో ప్రస్తుతం 20 మంది రైతులు దాకా పడిగాపులు పడుతున్నట్లు పేరు చెప్పడం ఇష్టం లేని ఓ స్థానిక ప్రజాప్రతినిధి వాపోయారు. నిబంధనలు విరుద్ధంగా ఓ ప్రతినిధి ఈ తతంగాన్ని నడిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం అయి వినాయక పురం పరపతి సంఘం అద్యక్షులు నిర్మల పుల్లారావు ను వివరణ కోరగా ఈ విషయం నా దృష్టికి రాలేదని సమాధానం దాటవేశారు.