Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బైక్ ర్యాలీలో పిలుపునిచ్చిన ఎమ్మెల్యే రాములు నాయక్
నవతెలంగాణ-వైరా
మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో జరిగిన అనేక అకృత్యాలు, రాజ్యాంగ ఉల్లంఘనలను ఎదిరించి నిలుస్తున్న కమ్యూనిస్టు సోదరులు అదే బాటలో నడుస్తున్న బిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో మీరు కూడా పాల్గొని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే ఎల్.రాములు నాయక్ కమ్యూనిస్టు పార్టీలను కోరారు. సోమవారం వైరాలో బిఆర్ఎస్ పార్టీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి ఎమ్మెల్యే స్వయంగా బండి నడుపుతూ నాయకత్వం వహించారు. ర్యాలీ అనంతరం క్రాస్ రోడ్ సెంటర్లో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు దార్న శేఖర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ రోజు సాయంత్రం నుండి నియోజక వర్గంలో పర్యటించి ఖమ్మం సభకు రావాలని కమ్యూనిస్టు పార్టీలను స్వయంగా ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బి.చంద్రావతి, మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మునిసిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు బాణాల వెంకటేశ్వర్లు ప్రసంగించారు. మార్కెట్ చైర్మన్ బీడీ కే.రత్నం, ఎంపీపీ వేల్పుల పావని, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు షేక్ లాల్ మొహమ్మద్, సోషల్ మీడియా కన్వీనర్ మోటపోతుల సురేష్, జిల్లా దిశా కమిటీ సభ్యులు కట్టా కృష్ణ అర్జున్ రావు, వేమి రెడ్డి కోటా రెడ్డి, జిల్లా నాయకులు మచ్చా బుజ్జి, మద్దెల రవి, పనితి సైదులు, సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేయండి : బాణోత్ మదన్ లాల్
18న ఖమ్మంలో సమీకృత నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభం, అనంతరం జరిగే భారతీయ రాష్ట్ర సమితి బహిరంగ సభను విజయవంతం చేయాలని వైరా మాజీ శాసనసభ్యులు బాణోత్ మదన్ లాల్ అన్నారు. సోమవారం ఆయన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ తర్వాత తొలిసారిగా 5 లక్షల మందితో జరిగే బిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. బహిరంగ సభకు ఢిల్లీ, కేరళ, పంజాబ్ ముఖ్యమంత్రులతో పాటు మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, వామపక్ష పార్టీల అగ్ర నాయకులు పలు రాష్ట్రాల రైతు నాయకులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండకుడమ సర్పంచ్ దోంతేబొయన శ్రీనివాస్ రావు, వైరా సొసైటీ డైరెక్టర్ దొంతేబోయిన వెంకటేశ్వర్లు, మేదరమెట్ల శ్రీనివాసరావు, కొత్తా వెంకటేశ్వరరావు, పాముల వెంకటేశ్వర్లు, చల్లా నరసింహారావు, కిలారు కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
జనసమీకరణ చేయండి
తల్లాడ : ఖమ్మంలో ఈ నెల 18న నిర్వహిస్తున్న టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు జన సమీకరణ ఏర్పాట్లపై తల్లాడ సొసైటీ కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. భారీగా జనం వచ్చే ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, పెద్ది సుదర్శన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఏ వాహనాలలో ఎంతమంది వస్తారు అనే విషయాలని అడిగి తెలుసుకున్నారు. సభానంతరం మళ్ళీ వారిని జాగ్రత్తగా ఇళ్లకు చేర్చే బాధ్యత నాయకులు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆర్వేర్ మోహన్ రెడ్డి, వైరా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ డి.భద్రరాజు, రైతు బంధు మండల అధ్యక్షుడు వెంకట్ లాల్, జోనల్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.