Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డున పడుతున్న కార్మికులు
నవతెలంగాణ-మణుగూరు
సింగరేణిలో వాషరీ ప్లాంట్లు ఒక్కోటి మూతపడు తున్నాయి. తక్కువ నాణ్యత కలిగిన బొగ్గును ఎక్కువ నాణ్యత కలిగిన బొగ్గుగా మార్చేందుకు వీటిని ఏర్పాటు చేశారు. ఉపరితల గనుల్లో లభించే జీ15 గ్రేడ్ బొగ్గును శుద్ధి చేసి జీ9 గ్రేడ్‌గా మార్చేందుకు ఈ ప్లాంట్లు ఉపకరిస్తాయి. మణుగూరు, రామగుండం, మంద మర్రిలో వీటినేర్పాటు చేయగా మందమర్రిలో నిర్వహణ లోపంతో గుత్తేదారు మధ్యలోనే పనులు ఆపేశారు. కొన్నేళ్ల క్రితం మూతపడింది. తాజాగా మణు గూరులో ఉన్న ఒక్క ప్లాంట్ ఈ నెల 20 నుంచి సేవలు ఆగిపోనున్నాయి. వాషరీ ప్లాంట్లు ప్రస్తుతం సింగరేణికి భారంగా మారాయి. కొన్నేళ్ల క్రితం గనుల్లో ఉత్పత్తి అయిన జీ15 గ్రేడ్ బొగ్గు రవాణా చేయుద్దని థర్మల్ కేంద్రాలు విధించిన నిబంధనల మేరకు కోల్ వాషరీ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం జీ15 సరకునూ పవర్ ప్లాంట్లు కొనుగోలు చేస్తుండటం సింగరేణికి కలిసొచ్చిన అంశం. గతంలో జీ15 గ్రేడ్ టన్ను రూ.970 ఉండేది. ప్రస్తుతం అదే రకం టన్ను రూ.1620 పలుకుతుంది. తక్కువ నాణ్యత కలిగిన ముడి సరకునకూ మంచి ధర లభిస్తోంది. ఈ పరిస్థితుల్లో శుద్ధి చేసి నాణ్యమైన గ్రేడు తీసుకురావటం ద్వారా సింగరేణికి అదనపు భారం అవుతుంది. ఒక టన్ను బొగ్గును శుద్ధి చేసేందుకు రూ.210 ఖర్చు చేయాల్సి వస్తోంది. కోల్ వాషరీ ప్లాంట్లు మూతపడటంతో పర్యావరణానికి కొంత మేలు జరగనుంది. శుద్ధి తర్వాత వ్యర్థాల నీటిని బయటకు వదులుతుంటారు. ఆ నీరు వాగులు, చెరువుల్లో కలుస్తున్నాయి. దీనివల్ల నీటి కాలుష్యం పెరుగుతుంది. కోల్ వాషరీ ప్లాంట్లు మూసివేతతో జలాల కలుషితం తగ్గనుంది. మణుగూరులో వ్యర్థాల నీరు సమితి సింగారం చెరువుకు ప్రవహిస్తుంటాయి. అయితే ప్లాంట్లు ఆగిపోవ టంతో కార్మికులు ఉపాధిని కోల్పోతున్నారు.
అర్ధాంతరంగా మూసివేస్తున్నట్లు యాజ మాన్యం ప్రకటించటంతో ఎన్నో ఏళ్లుగా పనిచే స్తున్న వారు కార్మికులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మణుగూరులోని ప్లాంట్‌లో గ్లోబల్ కంపెనీ కార్మికులు సుమారు 100 మంది ఉన్నారు కాంట్రాక్ట్ కార్మికులు 60 మంది ఉన్నారు. సుమారు 200 మంది కార్మికులు జీవన ఉపాధిని కోల్పోతున్నారు. వీరంతా ప్రత్యామ్నాయ ఉపాధి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్లోబల్ కోల్ వాషరీ ప్లాంట్‌తో సింగరేణి ఒప్పంద గడువు ముగిసింది. ఈ క్రమంలోనే వాటికి బొగ్గు అందించటం లేదు. నిజానికి నాలుగేళ్ల క్రితమే కంపెనీతో గడువు ముగిసినా పొడిగించారు. గ్లోబల్ వాసరీ ప్లాంట్ గడువు ఉపయోగించి కార్మికులకు ఉపాధి చూపించాలని లేదా ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని కార్మికులు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.