Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టర్ వినతి
నవతెలంగాణ-పాల్వంచ
అంగన్వాడి సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే మార్చి నెలలో సమ్మెకు సిద్ధమవుతామని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కే.సత్య అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడి ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనియెడల మార్చి ఒకటి రెండు మూడు తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ధనలక్ష్మి జిల్లా కమిటీ సభ్యులు దొడ్డా రవి కుమార్, భూక్య రమేష్ పాల్గొన్నారు.
కంటి వెలుగు కార్యక్రమానికి ఆశాలకు అదనంగా పారితోషకాలు చెల్లించాలి
కంటి వెలుగు కార్యక్రమానికి ఆశాలకు అదనంగా వారితోషకాలు చెల్లించాలని ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) జిల్లా ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేసి, మాట్లాడారు. టీఏడీఏ సదుపాయం కల్పించాలణీ డిమాండ్ చేశారు. ప్రభుత్వం అదనపు పారిదోషకం పైన ఇంకా స్వస్థత ఇవ్వకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆశాలు ఆందోళన చేయబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కే.సత్య, జిల్లా కమిటి సభ్యులు దొడ్ద రవి కుమార్, భూక్య రమేష్ పాల్గిన్నారు.