Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్యాలయంలో కొలువు తీరిన కలెక్టర్ అనుదీప్
- స్వాగతం పలికిన జెసీ, డీఆర్డీఏ
- తొలి సమావేశం ప్రజావాణిలో కలెక్టర్
- నూతన కలెక్టరేట్లోకి అన్ని శాఖలు షిఫ్ట్ కావాలి
- 17 వరకు అల్టిమేట్ చర్యలు తప్పవు
- కలెక్టర్ అధికారులకు ఆదేశం
నవతెలంగాణ-పాల్వంచ
ప్రజలకు అందుబాటులో అన్ని శాఖలు ఒకే దగ్గర ఉండే విధంగా పాల్వంచలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ఏర్పాటు చేసి ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ చేత ప్రారంభించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ఈ నూతన కలెక్టరేట్ భవనం నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తొలుత కలెక్టర్ అనుదీప్ తన కార్యాలయంలో కొలువుదీరారు. దీంతో జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్ఓ అశోక్ చక్రవర్తి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పలు అధికారులు, జర్నలిస్టు సంఘాల పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం తొలి సమావేశం ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించారు. సంక్రాంతి తెల్లవారి కావడంతో ప్రజలు ఎక్కువ సంఖ్యలో అన్ని ప్రాంతాల నుండి సమస్యలు విన్నవించుకోనేందుకు రాలేకపోయారు. ఈ ప్రజావాణిలో తొలి దరఖాస్తు పాల్వంచకు చెందిన అఫ్జల్ పర్వీన్ అనే మహిళ అందజేశారు. అనంతరం నూతన భవనంలోకి కొన్ని శాఖలు తన కార్యాలయాల్లోకి షిఫ్ట్ కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన కలెక్టరేట్ అన్యాంగులతో అన్ని శాఖలకు గదులు నిర్మించినప్పటికీ ఇంకా కార్యాలయంలోకి రాకపోవడం ఏంటని ప్రశ్నించారు. 17 కల్ల షిఫ్ట్ కానీ శాఖలపై చర్యలు తీసుకోవాలని డీఆర్డీఏను ఆదేశించారు. ప్రజావాణికి జిల్లాలో ఉన్న అధికారులు హాజరయ్యారు. హాజరుకాని అధికారులతో టెలికాన్ఫరెన్స్లో ఆయనే సమస్యలపై మాట్లాడారు. నూతన కలెక్టరేట్లో కార్యకలాపాలు ప్రారంభం పట్ల జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.