Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ మోడల్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తాం
- విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు
నవతెలంగాణ-మణుగూరు
ఈ నెల 18న ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ తొలి సభకు ఐదు లక్షల మందికి పైగా ప్రజలు హాజరవుతున్నారని విప్, ఎమ్మెల్యే రగా కాంతారావు అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ విధానాలను ఎండగట్టేందుకు కేరళ, పంజాబ్, ఢిల్లీ ముఖ్యమంత్రితో పాటు ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌లు హాజరవుతున్నారని అన్నారు. వామపక్షాల జాతీయ నాయకత్వం ఈ మహాసభకు హాజరవుతున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ఖమ్మం సభ వేదిక కానున్నది అన్నారు. పూర్తి స్థాయిలో నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకత్వం ఖమ్మం సభకు ప్రజలను తరలించేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం సభ వేదికగా దేశవ్యాప్త బీఆర్ఎస్ ఎజెండాను ప్రకటిస్తారని అన్నారు. దేశంలోని చిన్న చిన్న పార్టీలు బీఆర్ఎస్లో విలీనం కావడానికి సిద్ధమవుతున్నాయని అన్నారు. తెలంగాణలో ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశ ప్రజలందరూ కావాలని కోరుకుంటున్నారని అన్నారు. ఖమ్మం సభ దేశ చరిత్రలోనే స్థిర స్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు.