Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జవాన్లను అభినందించిన సెకండ్ కమాండెంట్ శెకావత్
నవతెలంగాణ-చర్ల
తమ ప్రాణాలను పణంగా పెట్టి మంటల్లో చిక్కుకున్న పసికందులను సీఆర్పిఎఫ్ 151 బెటాలియన్ జవాన్లు సురక్షితంగా కాపాడారు. ఛత్తీస్ ఘడ్ తెలంగాణ సరిహద్దు పామేడు గ్రామంలో నిర్మించిన సీఆర్పీఎఫ్ 151 బెటాలియన్ క్యాంపు సమీపంలోని పూరి గుడిసెలో సోమవారం మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగినాయి. గుడిసెలో నుంచి పొగ, మంటలు రావడాన్ని గమనించిన సీఆర్పీఎఫ్ క్యాంప్ సెంట్రీ జవాన్ గుడిసెలో నుంచి మంటలు వస్తున్న విషయాన్ని డిప్యూటీ కమాండెంట్ ప్రదీప్ సింగ్ షెకావత్‌కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన డిప్యూటీ కమాండెంట్, కమాండెంట్స్ తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మంటలను ఆర్పి మంటలలో చిక్కుకున్న ఇద్దరు చిన్నారులను సురక్షితంగా రక్షించారు. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన ఉంగా కుటుంబానికి తక్షణ సహాయంగా దుప్పట్లు, మందులు, వారం రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను అందించారు. సకాలంలో స్పందించి అగ్ని ప్రమాదంలో నుంచి చిన్నారులను రక్షించిన జవానులను డిప్యూటీ కమాండెంట్ ప్రదీప్ సింగ్ షెకావత్, స్థానికులు ప్రశంసించారు.