Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటి ముంగింట్ల రంగు వల్లులు
- గ్రామాల్లో క్రీడా పోటీలు
- ఆడిపాడిన యువత
నవతెలంగాణ-కారేపల్లి
సంక్రాంతి సందర్భంగా పల్లెలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. పండుగతో పట్టణాల నుంచి పల్లెకు వచ్చి పండుగను సంతోషాలతో సందడిగా జరిపారు. వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించి ప్రోత్సాహక బహుమతులు అందజేశాయి. బోగి మంటలు వేసి వాటి చుట్టు అడుతూ పాడుతూ యువతి కేరింతలు కొట్టారు. పండుగ రోజు ప్రతి ఇంటి ముంగింట సంక్రాంతి రంగువల్లులు వాటి మధ్యలో గొబ్బెమ్మలు తీరొక్క పూలు, కూరగాయాలు, రేగుపండ్లు వేసి అలంకరించారు. ముగ్గుల అలంకరణకు పోటీలు పడ్డారు.
విశ్వనాధపల్లిలో సందడి చేసిన పొంగల్ గ్రూపు
విశ్వనాధపల్లిలో పొంగల్ ప్యామిలీ వాట్సప్ గ్రూపు సభ్యులు సందడి చేశారు. ప్రతి ఏడాది పొంగల్ ప్యామిలీ గ్రూపు సభ్యుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలను జరుపుతారు. 30 కుటుంబాలకు చెందిన 100 మంది వరకు పెద్దలు పిల్లలు అంత ఒక్కదగ్గరు సంబురాలను జరుతుంటారు. వివిధ రకాల సాంప్రదాయ క్రీడలు, నృత్యాలు,పాటలతో మూడు రోజుల పాటు సందండి చేశారు. అందరు కలిసి వినోద కార్యక్రమాలలో పాల్గొని గ్రామస్తులను అనందంలో ముంచేత్తారు. విశ్వనాధపల్లిలో కబడ్డీ పోటీలకు స్పాన్సర్ చేశారు.
క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తాయి : సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు
బోనకల్ : క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక దేహదారుఢ్యాన్ని పెంపొందిస్తాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు అన్నారు. మండల పరిధిలోని తూటికుంట్ల గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, సర్పంచ్ నోముల వెంకట నరసమ్మ, మాజీ ఎంపీపీ తుళ్లూరు రమేష్, సిపిఎం మధిర పట్టణ మాజీ కార్యదర్శి పాపినేని రామ నరసయ్య బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలలో సిపిఎం, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంతాలలో నైపుణ్యం కలిగిన అనేక మంది క్రీడాకారులు ఉన్నారని, కానీ అటువంటి వారికి సరైన ప్రోత్సాహం లేక రాణించలేకపోతున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాలలో నైపుణ్యం కలిగిన క్రీడాకారులకు ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాపినేని రమేష్, పాపినేని అప్పారావు, పాపినేని వెంకటరావు, నోముల పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
వెంకటాపురంలో ముగ్గుల పోటీలు
ముదిగొండ : మండల పరిధిలో వెంకటాపురం గ్రామంలో రాయల కమలమ్మ మెమోరియల్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఆదివారం మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ పోటీలో గెలుపొందిన విజేతలతో పాటు, పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సలేషన్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం) మండల నాయకులు కందుల భాస్కరరావు, ఐద్వా మండల అధ్యక్షులు మందరపు పద్మ, సిపిఐ (ఎం) గ్రామ శాఖ కార్యదర్శి కటారి హుస్సేన్, నాయకులు మందరపు వెంకన్న పాల్గొన్నారు.
యువతను క్రీడా రంగంలో ప్రోత్సహించడంలో విఫలం : డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మద్దాల ప్రభాకర్
మధిర : యువతను క్రీడా రంగంలో ప్రోత్సహించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మద్దాల ప్రభాకర్ అన్నారు. దెందుకూరు గ్రామ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో కామ్రేడ్ వూట్ల వెంకటయ్య స్మారకంగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఆట, పాట, ముగ్గుల, పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను మద్దాల ప్రభాకర్ ప్రారంభించారు. ఐద్వా సంఘం టౌన్ అధ్యక్షులు సేక్ ఫాతిమా బేగం, హేమలత న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి తెలప్రోలు రాధాకృష్ణ, నాయకులు వూట్ల శంకర్ రావు, అల్లూరి నాగేశ్వర్రావు, పల్లికంటి విల్సన్ డీవైఎఫ్ఐ గ్రామ అధ్యక్ష కార్యదర్శులు కేసరి వీరభద్రం, వాడపల్లి మురళి, బండి నరేష్, శివకేశావ్, రాజేష్, నాజీర్ గోపి, గుర్రం సాయి పాల్గొన్నారు.
టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గులు పోటీలు
కారేపల్లి : మాజీ దివంగత ముఖ్యమంత్రి తెలుగుదేశం వ్యవస్ధాపక అధ్యక్షులు ఎన్టీఆర్ వర్ధంతిని పురష్కరించుకోని కారేపల్లిలో సోమవాం టీడీపీ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన ముగ్గుల పోటీలను మాజీ సర్పంచ్ మండెపూటి రాణి ప్రారంభించారు. ఈపోటీల్లో మహిళలు ఉత్సహంగా పాల్గొని తమ సృజనాత్మకను చాటుకున్నారు. విజేతలకు ఈనెల 18వ తేదిన నిర్వహించే ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈకార్యక్రమంలో టీడీపీ నాయకులు మండెపూడి శ్రీనివాసరావు, ఎండీ.యాకూబ్, కసంచి రమేష్, దుగ్గెంపూడి కొండలరావు, పోలూరి రామారావు, చిన్ని శ్రీనివాసరావు, బొగ్గారపు ముఖర్జీ యలగందుల మధు, కాసాని లక్ష్మినారాయణ. దుద్దుకూరి వెంకటేశ్వర్లు, పాటి అబ్బయ్య, చిలుముల రాములు తదితరులు పాల్గొన్నారు.
ఉసిరికాయలపల్లి ముగ్గుల పోటీలు
ఉసిరికాయలపల్లిలో పర్సా ట్రస్ట్, మధర్ థెరిస్సా యూత్ ఆధ్వర్యంలో సోమవారం ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈపోటీల్లో మహిళలు ఉత్సహంగా పాల్గొన్నారు. ఈ పోటీలలో విజేతలకు డాక్టర్ పర్సా పట్టాభి రామారావు- డాక్టర్ విజయలక్ష్మి దంపతులు బహుమతులు అందజేశారు.
పాతకారాయగుడెంలో ముగ్గుల పోటీలు
నవతెలంగాణ-పెనుబల్లి
పాత కారాయిగూడెం యువజన సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. గ్రామ స్థాయి ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాతకారాయిగూడెం గ్రామ సర్పంచ్ చిట్టెమ్మ, మండల ఉపసర్పంచ్ నరుకుళ కస్తూరి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
క్రికెట్ విజేతలకు బహుమతులు అందజేత
నవతెలంగాణ-పెనుబల్లి
క్రికెట్ క్రీడాకారులకు నగదు, మెమొంటోలు సోమవారం విజేతలకు అందజేశారు. సంక్రాంతి సందర్భంగా పెనుబల్లి గ్రామస్తుల ఆధ్వర్యంలో మూడు రోజులుగా క్రికెట్ క్రీడా పోటీలు మండల కేంద్రంలో నిర్వహించారు. ముగింపు సందర్భంగా విజేతలకు సీఐ హనోక్, ఎస్సై సూరజ్ చేతుల మీదుగా నగదు, మెమొంటోలను అందజేశారు. ఈ సందర్భంగా క్రికెట్ క్రీడా పోటీలను నిర్వహించిన నిర్వాహకులును సిఐ అభినందించారు. ఈ కార్యక్రమంలో పొట్లపల్లి వెంకటేశ్వరరావు, మల్లెల రాజా తదితరులు పాల్గొన్నారు.
చొప్పకట్లపాలెంలో విజయవంతంగా ముగిసిన సంక్రాంతి క్రీడలు
బోనకల్ : మండల పరిధిలోని చొప్పకట్లపాలెంలో సంక్రాంతి సందర్భంగా డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఐద్వా కమిటీల ఆధ్వర్యంలో 13,14, 15 తేదీలలో క్రీడా, సాంస్కృతిక, వైజ్ఞానిక పోటీలను నిర్వహించారు. ఎస్.ఎఫ్.ఐ జెండాను పరిటాల వినరు, డివైఎఫ్ఐ జెండాను దారెల్లి ఆంజనేయులు ఆవిష్కరించారు. స్టార్ గుర్తును షేక్ హస్సాన్ సాహెబ్, చిరంజీవి పుసులూరి ఆశ్లేషలు అందంగా తీర్చిదిద్దారు. కబడ్డీ, వాలీబాల్, క్విజ్, ముగ్గులు, పాటలు, బస్తాల పరుగు, స్కిప్పింగ్ వంటి క్రీడలలో క్రీడాకారులు ఔత్సాహికంగా పాల్గొన్నారు. పండుగకు గ్రామానికి చేరుకున్న బంధువులు సైతం క్రీడలను ఆసక్తిగా తిలకించారు. ఆదివారం రాత్రి క్రీడలలో విజేతలకు బహుమతులు అందజేశారు. గ్రామంలో వ్యవసాయ, అనుబంధ రంగాలలో ప్రతిభ కనబరుస్తున్న రైతులు షేక్ మదార్ సాహెబ్, కోటపర్తి ఎలిశమ్మ, బాలు శైలజలను సన్మానించారు.పేదరికాన్ని జయించి కష్టపడి చదివి ఉద్యోగం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలచిన వేశాల నాగరాజును, ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యశిస్తూ ప్రతిభ కనబరస్తున్న షేక్ సలీమ్ ను కూడా ఘనంగా సన్మానించారు. విజేతలకు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, తెలంగాణ రైతుసంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, పల్లెప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండలరావు, మాజీ సర్పంచి బూసి వెంకటేశ్వర్లు, ఐద్వా నాయకురాలు బోయనపల్లి వాణిలతో పాటు బహుమతి దాతలు బహుమతులు అందజేశారు. డీవైఎఫ్ఐ గ్రామశాఖ అధ్యక్షులు షేక్ హస్సాన్ సాహెబ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో డివైఎఫ్ఐ గ్రామ కార్యదర్శి దారెల్లి ఆంజనేయులు, ఎస్ఎఫ్ఐ నాయకులు నల్లమోతు సాయికుమార్, బండి శ్రీనివాసరావు, కొండేటి అప్పారావు, రచ్చ మధు సూదన్ రావు, చలమల అజరు కుమార్, బోయనపల్లి పున్నయ్య, ఉన్నం వెంకటేశ్వర్లు, పరిటాల కొండలరావు, రచ్చ శివకుమార్, కొండేటి ప్రవీణ్, మెట్టెల వీరబాబు, దరిశ రాము, బండి సతీష్, దారెల్లి శ్రీను, నోముల దిలీప్ తదితరులు పాల్గొన్నారు.