Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దగ్గరి, దూరపు చూపుల కలిపి లేని కళ్ళజోళ్ళ ఆఫ్షన్లు
- ఏదో ఒకటి ఇస్తున్న వైనం : ప్రభుత్వ లక్ష్యం ఎండమావులే
నవతెలంగాణ-ఇల్లందు
ఏ కంటి సమస్య ఉన్నవారైనా నివారణా మార్గాలను, కళ్ళజోళ్ళు, అత్యున్నత నాణ్యత కలిగిన వైద్యం ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. రూ.కోట్లు ఖర్చు చేస్తున్నామంటున్నారు. కంటి వెలుగు కారక్రమానికి వెళ్ళే వారికి దగ్గరి, దూరపు చూపుల కలిపి లేని కళ్ళజోళ్ళ ఆఫ్షన్లు డేటాలో ఉండటం లేదు. దీంతో కళ్ళ జోళ్లు లేకుండానే బాధితులు వెనుదిరగాల్సి వస్తోంది. కొందరికి దగ్గరి రీడింగ్ గ్లాస్ ఇస్తున్నారు.
వివరాల్లోకి వెళితె... పట్టణంలోని మామిడి చెట్ల ప్రభుత్వ పాఠశాలలో గురువారం ఎంఎల్ఏ హరిప్రియ ఆధ్వర్యంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి ఇతర కార్యక్రమాలకు వెళ్ళిపోయారు. కంటి పరీక్షలు చేయడానికి ఆర్బిఎస్ఎ మెడికల్ ఆఫీసర్, ఏరియాల ఇంచార్జులుగా ఆఫ్తాల్మిక్ అసిస్టంట్లను, ఇతర సిబ్బందిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కంటి సమస్యలు ఉన్న ప్రజలు పరీక్షలు చేయించుకున్నారు. కొందరికి దగ్గరి చూపు ఉంచే మరి కొందరికి దూరపు చూపులోపాలు ఉన్నాయి. ఆధార్ కార్డుతో పాటు కంటి లోపాలను ఆన్లైన్లో సిబ్బంది నమోదు చేస్తున్నారు. అనంతరం వెంటనే కళ్ళ జోళ్ళు ఇస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. మరి కొందరికి దగ్గరి, దూరపు చూపు లోపాలు రెండు ఉన్నాయి. వీరికి 40 రోజులకు కంటి అద్దాలు వస్తాయని సెల్ నెంబర్‌కు ఫోన్ చేసి పిలిచి ఇస్తారని సిబ్బంది అంటున్నారు. కాని టాబ్లో ఆప్ఫన్స్ నమోదు కాక సమస్యగా తయారైంది. ప్రభుత్వానికి అద్దాలు ఇవ్వాలనే ఉద్దేశం ఉంటె ఆప్షన్స్ పెట్టేదేమోనని బాధితులంటున్నారు. దగ్గరి, దూరపు చూపు రెండు రకాల లోపాలు ఉన్నవారికి ఆర్ఇ, ఎస్పిహెచ్ 1.00, ఎల్ఇ 1.00, ఆర్.0.75, ఎల్.2.25 ఇలా కంటి సమస్యలు ఉంటున్నాయి.
వీటిని ఆన్లైన్లో నమోదు చేస్తుంటే సబ్మిట్ కావడంలేదు. ఈ ఆఫ్షన్స్ ట్యాబ్‌లో లేక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. 35 నుండి ఆపై వయస్సున్న వారికి దగ్గరి, దూరపు చూపులోపాలు ఉన్నవారు అధికంగా ఉంటారు. వీటితోపాటుగా కొందరికి కెటారాక్ట్, శుక్లాలు ఉన్నవారు ఉంటారు. సర్జరీలు అవసరం ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఏమి లేకుండా రెండు రకాల చూపులో లోపాలు ఉన్నవారికి న్యాయం జరగడంలేదు. దీంతో బాధితులతో గొడవలేందుకని మళ్ళీ టెస్ట్‌లు చేయించడం లేదా పరీక్షలు చేసిన నిర్వాహకులతో రిపోర్టులు దిద్దించడం చేస్తున్నారు. ఆప్షన్లలో ఉన్నవాటిని వేసి దగ్గరిదో, దూరపు చూపుదో నమోదు చేసి ఏదో ఒక రీడింగ్ కళ్ళజోడు ముఖానికి పెడుతున్నారు. ఈ రకమైన అద్దాలు పెట్టుకుని వెళితె కళ్ళకు మరిన్ని సమస్యలు ఏర్పడి బాధితులు కిందపడటం, దేనికైనా గుద్దుకునే ప్రమాదాలు ఉంటాయి. వాస్తవానికి కంటికి ఉన్న సమస్యకు తగ్గట్టుగా కళ్ళజోళ్ళు ఇవ్వడం లేదు. దీంతో ప్రభుత్వ లక్ష్యం ఎండమావిగానే ఉంది. ఆఫ్తాల్మిక్ అసిస్టంట్ డా. మున్వర్ అలీని వివరణ కోరగా రిపోర్టులు మ్యానువల్‌గా రాస్తునాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు.