Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టిఎస్ఈఆర్సి చైర్మన్ శ్రీ రంగారావు
- గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం
ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు.
-గిరిజనుల అభ్యున్నతే లక్ష్యం మాజీ మంత్రి జలగం ప్రసాద్ రావు
నవతెలంగాణ-అశ్వారావుపేట
తెలంగాణ రాష్ట్ర సాకారం వల్ల సీఎం కేసీఆర్ విద్యుత్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చి రూ.3800 కోట్ల వ్యయం చేసి అంధకారం లేని, రైతుల ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చారని రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఛైర్మన్ తన్నీరు శ్రీ రంగారావు అన్నారు. జలగం వెంగళరావు ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో వ్యవసాయం నిమిత్తం వ్యక్తిగత కరెంటు మోటార్లు, పంపు సెట్లు, స్టార్లర్లు, పైపులను 44 మంది గిరిజన రైతులకు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి గురువారం పంపిణీ చేశారు. గిరిజన రైతులు సీసం నాగేశ్వరరావు, సీసం రాంబాబులు విద్యుత్ మోటార్లు స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. అనంతరం మాజీ మంత్రి జలగం ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీ రంగారావు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సమస్య ఉండేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత విద్యుత్ సమస్యలను అధిగమించి ప్రస్తుతం మిగులు విద్యుత్ ఉత్పత్తికి చేరుకున్నామన్నారు. రూ.40 కోట్లు వ్యయంతో భద్రాద్రి, యాద్రాద్రి విద్యుత్ ప్లాంట్లు నిర్మించుకుంటున్నామన్నారు. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించుకుని, వాటి ద్వారా విద్యుత్ ను కూడా ఆదా చేస్తున్నామని రైతులకు వివరించారు. రైతులకు ఉచిత విద్యుత్, విద్యుత్ లేని గంగారం, తిమ్మాపురం, గిరిజనులకు ఇటీవల విద్యుత్, సరఫరా చేయటం వల్ల వారి ఆనందాలకు అవధులు లేవన్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత జలగం వెంగళరావు మంచి పరిపాలనాధ్యక్షుడు, నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి పేరున ట్రస్టు ఏర్పాటు చేసి గిరిజనులకు సేవ కార్యక్రమాలు చేపటటం పట్ల జలగం ప్రసాదరావును అభినందించారు.
ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఉచిత విద్యుత్, రూ.250 కోట్లతో రైతుబంధు, రైతు భీమా వంటి పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఇప్పటి వరుకు జెవిఆర్ ట్రస్టు 700 విద్యుత్ మోటార్లు ను పంపిణీ చేశారని, దీనికి తనవంతు సహకారం అందిస్తున్నానని వివరించారు. గాండ్లగూడెం - కావడిగుండ్ల రోడ్డు మరో 3కిల్లో మీటర్లు ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే వివరించారు.
మాజీ మంత్రి, ట్రస్టు నిర్వహకులు జలగం ప్రసాదరావు మాట్లాడుతూ గిరిజన రైతులు ఆర్ధికంగా బలోపేతం కావాలన్నదే తమ లక్ష్యమన్నారు. వృధాగా పోతున్న వాగులు, వంకలు జలాలను రైతులకు వినియోగంలోకి తేచ్చేందుకు తమ ట్రస్టు ప్రయత్నం చేస్తుందని, విద్యుత్ నియంత్రణ మండలి ద్వార విద్యుత్ లైన్ లు అనుమతులు కల్పించాలని జలగం కోరారు. దీనికి స్పందించిన కమీషన్ చైర్మన్ శ్రీ రంగారావు వచ్చే ఫిబ్రవరి నెలలో వరంగల్లో బోర్డు డైరెక్టర్లు తో సమావేశం ఉందని, దానికి మీరు దరఖాస్తు చేసుకోవాలని జలగం కు సూచించారు. ఈ ప్రాంతంలో విద్యుత్ స్టాఫ్ కొరత ఉందని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గిరిజన విద్యార్థులు 10వ తరగతి చదివితే నర్సింగ్ శిక్షణకు తన ట్రస్టు రూ.20 వేలు భరిస్తుందని, మిగిలిన రూ.10 వేలు వ్యక్తిగతంగా విద్యార్థులు భరించాలన్నారు. అనంతరం శ్రీరంగారావు, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు, బండారు కృష్ణయ్య, నాగరాజులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు బండారు కృష్ణయ్య, నాగరాజు, విద్యుత్ ఎస్ఈ కె.రమేష్, మల్లాయిగూడెం, కన్నాయిగూడెం సర్పంచ్లు నారం రాజశేఖర్, గొంది లక్ష్మణరావు, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామూర్తి, జడ్పీటీసీ వరలక్ష్మి, డీసీసీబి డైరెక్టర్ నిర్మల పుల్లారావు, కొటగిరి సీతరామ స్వామి.యూ.ఎస్ ప్రకాశరావు, జూపల్లి బ్రహ్మారావు,కంగాల కల్లయ్య, తహశీల్దార్ చల్లా ప్రసాద్, ఎంపీడీవో విద్యాదరావు, ఎంపీవో సీతారామరాజు, ఈఈ విజరు, ఏడీఈ వెంకటేశ్వరరావు, ఏఈ శివశంకర్ పలు గ్రామాల గిరిజనులు పాల్గొన్నారు. ఎస్ఐ రాజేష్ శాంతి భద్రతలను పర్యవేక్షించారు.