Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమ్యూనిస్టులు లేకుండా దేశానికి భవిష్యత్తు ఉందా..
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-చండ్రుగొండ
బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి ప్రజా సమస్యలపై ముందుకు వెళ్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. గురువారం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మండల కార్యదర్శి వంకాయలపాటి శ్రీనివాసరావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులు ఓదార్చి సంతాప సానుభూతిని తెలియజేశారు. అనంతరం స్థానిక పార్టీ కార్యాలయంలో మండల కార్యదర్శి ఐలూరి రామ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ శ్రీనివాసరావు ఈ ప్రాంతంలో గుర్తింపు పొందిన నాయకుడని అన్నారు. పోడభూముల సమస్యల మీద పోరాటం చేసి 5000 ఎకరాల భూమిని సాధించారన్నారు. ఆయనపై ఫారెస్ట్, పోలీస్ వారు 25 కేసులు పెట్టిన వెనుకంజా వేయలేదన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతానికి సావే లేదన్నారు. కమ్యూనిస్టుల కు భవిష్యత్తు ఉందా లేదా అన్నది కాదు కమ్యూనిస్టులు లేకుండా దేశానికి భవిష్యత్తు ఉందా అని ఆయన అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బిజెపి వ్యతిరేక శక్తులతో కలిసి వెళ్తామన్నారు. కమ్యూనిస్టు పార్టీలు అధికారంలో ఉన్న దేశాల్లో, రాష్ట్రాల్లో మాత్రమే ప్రజలకు మౌలిక సదుపాయాలు అందుతున్నాయన్నారు. బిజెపి విధానాలను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది కాబట్టే ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొన్నామన్నారు. పోడు సమస్య, కాంటాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్, జర్నలిస్టు జిల్లా స్థలాలు, ఖాళీ స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మాణానికి ఐదు లక్షల ఇవ్వాలని, ఖాళీ స్థలం ఉన్నవారికి పట్టా ఇవ్వాలని, అనేక రకాల సమస్యలపై ఖమ్మం బహిరంగ సభలో సీఎం కేసీఆర్కు వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పెన్షన్లు, సాగునీటి సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. బిజెపిని నివారించడానికి కలిసి పనిచేసిన ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడుతామని అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, జిల్లా కమిటీ సభ్యులు కొండపల్లి శ్రీధర్, అన్నవరపు సత్యనారాయణ, జూలూరుపాడు మండల కార్యదర్శి యాస నరేష్, మండల కమిటీ సభ్యులు పెద్దిన్ని వేణు, గాలి రామారావు, రాయి రాజా విప్పర్ల పెద్ద వెంకటేశ్వర్లు, రామడుగు వెంకటాచారి, శాఖా కార్యదర్శులు చల్లపల్లి రాజా పొట్టేటి శ్రీనివాస్ రెడ్డి, దాసరి సీతారాములు, నాగుల మీరా, అబ్దుల్ రెహ్మాన్ ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.