Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లా కలెక్టర్ అనుదీప్
బూర్గంపాడు : తొలి రోజు అంతటి ఉత్సాహంతో వంద రోజులు కంటి వెలుగు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం బూర్గంపాడు మండలం పినపాక పట్టినగర్ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన ఆక స్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్యాంపు నిర్వహణకు చేసిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కంటి సమ స్యలు పరిష్కారానికి ఒక బృహతర మంచి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆయన అన్నారు. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం కంటి వెలుగు కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని ఆయన అన్నారు. నిర్దేశించిన సమయం ప్రకారం ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభించి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించాలని ఆయన చెప్పారు. ప్రజలు కంటి వెలుగు ఉచిత కంటి పరీక్షా కేంద్రంలో 18 సంవత్సరాలు పైబడిన వారందరూ పరీక్షలు నిర్వహించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ శిరీషా, తహశీల్దార్ బి. భగవాన్ రెడ్డి, ఎంపీడీవో వివేక్ రామ్, ఎంపీఓ సునీల్ తదితరులు పాల్గొన్నారు.
కన్నుల పండుగగా కంటి వెలుగు : ఎమ్మెల్యే హరిప్రియ
ఇల్లందు : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ-కంటి వెలుగు పథకం రెండో విడత కార్యక్రమంలో భాగంగా గురువారం మున్సిపాలిటీ స్త్రీ శక్తి భవనంలో ఎమ్మెల్యే హరిప్రియ, మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలోని 6, 7 వార్డ్ లో 5 రోజులపాటు కార్యక్రమం ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలందరికీ దృష్టి లోపాలను నివారించి, అందత్వ రహిత తెలంగాణ నిర్మాణంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారని అన్నారు. అనంతరం వైద్యులు నిర్వహిస్తున్న కంటి పరీక్ష విధానాన్ని వీక్షించి వారి నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు చేసుకున్న వారికి కంటి అద్దాలను ఎమ్మెల్యే అందించారు. గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల్ రాజేందర్, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ సయ్యద్ జానీ పాషా, మున్సిపల్ కమిషనర్ అంకుషావలి, తాసిల్దార్ కృష్ణవేణి డాక్టర్ కవిత, కౌన్సిలర్లు తోటలలిత, సామల మాధవి రవితేజ పాల్గొన్నారు.
కంటి వెలుగు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి
జెడ్పి సీఈవో విద్య లత
చంద్రుగొండ : కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ సీఈఓ విద్యాలత సూచించారు. గురువారం చండ్రుగొండ రైతు వేదికలో రెండో విడత కంటి వెలుగు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు బానోత్ పార్వతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కొనకళ్ళ వెంకటరెడ్డి, జడ్పి కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, వైస్ ఎంపీపీ నరుకుల్ల సత్యనారాయణ, స్పెషల్ ఆఫీసర్ సంజీవరావు, తహసీల్దార్ వరస రవికుమార్ ఎంపీడీవో అన్నపూర్ణ, ఎంపిఓ తులసీరామ్, మెడికల్ ఆఫీసర్ కనకం తనుజ, బిఆర్ఎస్ పార్టీ మండల సెక్రెటరీ ఉప్పతల ఏడుకొండలు, మండల ఉపాధ్యక్షులు భూపతి శ్రీనివాసరావు, మండల నాయకులు పాల్గొన్నారు.
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి
విప్ రేగా కాంతారావు
మణుగూరు : కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు అన్నారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని కోటకట్ట ఏరియాలో గల హరిజనవాడలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెండో విడత కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దృష్టి లోపాలను, అంధత్వాన్ని నివారించేందుకు కంటి వెలుగు పథకం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ నాగరాజు, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, జడ్పిటిసి పోషం నరసింహారావు, ఎంపీపీ కారం విజరు కుమారీ, పిఎసిఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, మండల అధ్యక్షుడు ముత్యం బాబు .పట్టణ అధ్యక్ష కార్యదర్శులు అడపా అప్పారావు, నవీన్, తదితరులు పాల్గొన్నారు.
కంటి పరీక్ష శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
భద్రాచలం : శాసనసభ్యులు పొదేం వీరయ్య భద్రాచలం పట్టణం జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన కంటి వెలుగు పధకం కంటి పరీక్ష శిబిరాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కంటి పరీక్షలు చేయు విధానాన్ని స్వయంగా పరిశీలించి పరీక్ష చేయించు కున్నటువంటి లబ్ధిదారులకు కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ నాగలక్ష్మి, డాక్టర్ చైతన్య తదితరులు పాల్గొన్నారు.
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి
ఆళ్ళపల్లి (గుండాల) : మండల కేంద్రంలోని ఏపీఆర్ పాఠశాల ఆవరణలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపీపీ ముక్తి సత్యం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగదివ్య, ఎంపీడీవో ఎస్.వి.సత్యనారాయణ, మండల పంచాయతీ అధికారి వలీ హజరత్, ఎస్సై కిన్నెర రాజశేఖర్, సర్పంచ్ కోరం సీతారాములు, ఉప సర్పంచ్ మానాల ఉపేందర్, వైద్యాధికారి మనీష్ రెడ్డి, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, పాల్గొన్నారు.
కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించుకోవడం గొప్ప విషయం
- ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి
ఆళ్ళపల్లి : భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని కంటి వెలుగు కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో విజయవంతంగా రెండవ విడత ప్రారంభించుకోవడం గొప్ప విషయమని స్థానిక ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి, జెడ్పీటీసీ కొమరం హనుమంతరావు అన్నారు. ఈ మేరకు మండల పరిధిలోని రాయిపాడు గ్రామం రామ చంద్రయ్య గుంపు ప్రాథమిక పాఠశాలలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపీపీ, జెడ్పీటీసీ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ మొహమ్మద్ సాదియా సుల్తానా, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారులు అర్వపల్లి రేవంత్, సంఘమిత్ర, మండల ప్రత్యేక అధికారి ఎం.వెంకటేశ్వర రెడ్డి, వైస్ ఎంపీపీ రేసు ఎల్లయ్య, సర్పంచ్ ఊకె ఈశ్వరి, సెక్రటరీ రమేష్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాయం నరసింహారావు, ఎంపీఓ వీరభద్రయ్య, ఏఎస్ఐ వెంకట్ రెడ్డి, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
కంటి వెలుగు గొప్ప సంకల్పం : ఎమ్మెల్యే వనమా
పాల్వంచ : కంటి వైద్యం చేయించలేని లక్షలాదిమంది పేద ప్రజలకు చూపు ప్రసాదించాలనే గొప్ప సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా గురువారం మున్సిపాలిటీ పరిధిలోని పాత పాల్వంచలోని హైస్కూల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని వనమా ప్రారంభించారు. స్వయంగా తాను కూడా కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఒకసారి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగిందని మరల ఇప్పుడు రెండోసారి కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ప్రజలు 100 రోజులపాటు జరిగే కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వనమా అన్నారు. ఈ కార్యక్రమంలో కంటి వెలుగు రాష్ట్ర నోడల్ అధికారి రవికుమార్, డిఎంహెచ్ ఓజెవి ఎల్.శిరీష, డాక్టర్ నామా డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, తహసిల్దార్ రంగా సిడిపిఓ కనకదుర్గ, పట్టణ ఎస్సై నరేష్, మున్సిపల్ ఏఈ రాజేష్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మంతపురి రాజు గౌడ్, పెద్దమ్మ గుడి మాజీ చైర్మన్ మహిపతి రామలింగం, సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్, డైరెక్టర్ కనగాల నారాయణరావు, టిఆర్ఎస్ నాయకులు కొత్వాల సత్యనారాయణ పాల్గొన్నారు.
కంటి చూపు జీవితానికే వెలుగు : ఎమ్మెల్యే మెచ్చా
నవతెలంగాణ-అశ్వారావుపేట
కంటి చూపు జీవితానికే వెలుగును ఇస్తుందని, ప్రస్తుతం ఆధునిక జీవనంలో కంటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సూచించారు. కంటి వెలుగు రెండో దశ కార్యక్రమాన్ని ఆయన గురువారం అశ్వారావుపేట రైతు శిక్షణ కేంద్రంలో లాంచనీయంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి జల్లిపల్లి శ్రీరామమూర్తి, జెడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి, తహశీల్దార్ చల్లా ప్రసాద్, కంటి వెలుగు మండల ప్రత్యేక అధికారి,అశ్వారావుపేట వైద్యాధికారి డాక్టర్ రాందాస్,గ ుమ్మడవల్లి పి.హెచ్.సి వైద్యాధికారి డాక్టర్ మధుళిక, అశ్వారావుపేట, పేరాయిగూడెం, గుమ్మడవల్లి కంటి వెలుగు కేంద్రాల పర్యవేక్షకులు డాక్టర్ మాధురి, డాక్టర్ నీలిమ, డాక్టర్ వెంకటేశ్వర్లు, నాయకులు మందపాటి రాజమోహన్ రెడ్డి పాల్గొన్నారు.
కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం
ములకలపల్లి : మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో కంటి వెలుగు కార్యక్రమాన్ని జెడ్పీటీసీ సున్నం నాగమణి, ఎంపీపీ మట్ల నాగమణిలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ బాలు, ఎంపీడీవో చిన్న నాగేశ్వరావు, ఎంపీఓ. డి లక్ష్మయ్య, డాక్టర్ సాయి కళ్యాణ్ , క్యాంపు డాక్టర్ పద్మ కుమార్, కంటి డాక్టర్ సాయి కృష్ణ, డేటా ఎంట్రీ ఆఫీసర్ రమేష్ బాబు, ఎంపీటీసీ కొర్రి భద్రయ్య, సర్పంచ్ సున్నం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.