Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అలరించిన స్కై లాంతర్
- ప్రోత్చహిస్తున్న చిరు వ్యాపారి '' కబీర్ ''
నవతెలంగాణ-పాల్వంచ
పట్టణ పరిధి లోని శాస్త్రి రోడ్ లో పతంగుల పండుగ చివరి రోజు అయిన గురువారం పలువురు యువకులు నూతన తేజంతో కోలాహాలంగా జరిపారు. ప్రతి యేటా శాస్త్రి రోడ్ లోని హసీమ ఫాన్సీ స్టోర్ నిర్వాహకులు కబీర్ ఘనంగా నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా బుధవారం రాత్రి స్కై లాంతర్ లను ఆకాశంలోకి ఎగురవేసి పట్టణ ప్రజలను ఆకట్టుకున్నారు. సుమారు వంద నుండి 150 మంది వరకు యువత ఈ స్కై లాంతారు ఎగురవేసే కార్యక్రమంలో ఎంతో ఉత్చాహంగా పాల్గొన్నారు. ముగింపు రోజు పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులను అవ్వానించి, పతంగులు ఎగురవేసిన యువకులతో కేకులు కట్ చేపించి, స్వీట్స్ పంపిణీ చేస్తుందటం ఆనావాయితీ వస్తుంది. ఈ సంవత్సరం కూడా ఇట్టి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించి, పలువురిని అవ్వానించారు. ఈ సందర్భంగా విశ్రాంత డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కుమార్ మాట్లాడుతూ కుల, మతాలకు ఆతీతంగా కబీర్ ఇటువంటి కార్యక్రమం నిర్వహించటం హర్షనియామన్నారు. అనంతరం వర్తక సంఘం కన్వీనర్ చాలువాది ప్రకాష్ మాట్లాడుతూ చిరు వ్యాపారిగా కబీర్ ఉన్నతమైన సేవ తత్వం కలిగి ఉండటం పలువురికి ఆదర్శనియామన్నారు. ఈ సందర్బంగా చిరు వ్యాపారి కబీర్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కుమార్, ప్రకాష్ లతో పాటు పట్టణానికి చెందిన పాత్రికేయలు ఏ.అబ్బురాం, కొండలరావు, పి పుల్లారావు, ఎండి జైనుల్లా బుద్దీన్, యువజన నాయకులు పూసల రమేష్, సాధత్ అలీ వెంకటేశ్వర్లు, రమేష్, రాంబాబు, సిపిఐ పట్టణ కార్యదర్శి ఏ సాయిబాబా, సత్యనారాయణ పాల్గొన్నారు.