Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-కొత్తగూడెం
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం మీ ఇంటికే వెలుగులు చిమ్ముతుందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని రామవరం 6వ వార్డులో కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారు.అనంతరం కంటి పరీక్షలు చేయించుకున్న ప్రజలకు కళ్ళజోళ్ళు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకమైన కంటి వెలుగు పథకాన్ని ప్రవేశపెట్టారని, ప్రజలందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ రఘు,తహసీల్దార్ రామకృష్ణ,, డిస్టిక్ కంటి వెలుగు ప్రోగ్రాం అధికారి పర్శు నాయక్, డిప్యూటీ డిఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ మణికంఠ రెడ్డి, కంటి వెలుగు ప్రోగ్రాం అధికారి ఇమ్మానియేల్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ రాము, పీఎంఓ తరుణ్, కౌన్సిలర్ జమలయ్య, బిఆర్ఎస్ నాయకులు గౌస్, దొమ్మేటి నాగేశ్వరరావు, మజీద్, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు-జెడ్పీ సీఇఓ విద్యాలత
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్ సీఇఓ మెరుగు విద్యాలత అన్నారు. గురువారం చుంచుపల్లి మండలం పెనగడప గ్రామ పంచాయతీ పెనగడప హై స్కూల్ లో ప్రారభించిన కార్యక్రమం ఈనెల 30వ తేదీ వరకు ఉచితముగా కంటి వెలుగు పరీక్షలు ఉచితంగా నిర్వహించి, కళ్ళజోడులు పంపిణీ చేసే కార్యక్రమం సెంటర్ను చుంచుపల్లి ఎంపిపి బాదావత్ శాంతి, సీఇఓ ప్రారంభించినారు అనంతరం వారు కంటి వెలుగు నిర్వహించు కేంద్రాన్ని, ప్రతి సెక్షన్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ కంచర్ల చంద్రశేఖర రావు, వైస్ ఎంపిపి వట్టి కొండ మల్లికార్జున రావు, సర్పంచ్ మాలోతు కళావతి, ఉప సర్పంచ్ సంతోష్ కుమార్, ఎంపిటీసీ అచ్చ నాగమణి, వ్యవసాయ కమిటీ మెంబర్ మోతే కరుణాకర్, ఎంపీడిఓ సకినాల రమేష్, తహసీల్దార్ వనం కృష్ణ ప్రసాద్, ఎంపీఓ గుంటి సత్యనారాయణ, పెనగడప వైద్యులు డాక్టర్ నేహా, కంటి వెలుగు డాక్టర్ నవజ్యోతి, ఎంపిపి కో- ఆప్షన్ మెంబెర్ ఆరీఫ్ ఖాన్ పాల్గొన్నారు.
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోండి
ఎంపీపీ గుమ్మడి గాంధీ
పినపాక : నేత్ర సమస్యలు లేకుండా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీపీ గుమ్మడి గాంధీ అన్నారు. జానంపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ మహేష్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంధత్వానికి గురైన అన్ని ప్రాంతాల ప్రజలకు అత్యున్నత నాణ్యత కల్గిన వైద్యం పైసా ఖర్చు లేకుండా అందుబాటులోకి తీసుకువస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఉషా శారద, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఎంపీఓ శ్రీనివాసరావు, ఎంపీటీసీలు హరీష్, సత్యం, శేఖర్, ఉమాదేవి, పిఎసిఎస్ చైర్మన్ డాక్టర్ రవి శేఖర్ వర్మ, ఆత్మ కమిటీ చైర్మన్ పటేల్ భద్రయ్య, సర్పంచ్ నాగేశ్వరరావు, సెక్రటరీలు, వివిధ శాఖల అధికారులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బుల్లిబాబు , ఉపసర్పంచ్ రాయల సత్యనారాయణ, జానంపేట పిహెచ్సీ వైద్యులు వెంకటేశ్వర్లు, పంచాయతీ సెక్రెటరీ నాగిని, గ్రామ కమిటీ అధ్యక్షులు గుండం దామోదర్, సూరినేని దర్మయ్య, పాల్గొన్నారు.