Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు కలెక్టర్ వి.పి. గౌతమ్ ఆదేశాలు
- సమీకృత భవన ప్రారంభ విజయవంతంపై అభినందనలు
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కంటి వెలుగును విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ కోరారు. సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో అధికారులతో గురువారం కలెక్టర్ సమీక్షించారు. ప్రత్యేక అధికారులు కంటి వెలుగు కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నమోదు నుండి పరీక్ష పూర్తయ్యే వరకు క్యూ, వేచివుండు ఏర్పాట్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మెప్మా, స్వయం సహాయక బందాలు ప్రజల సమీకరణ విషయంలో ఉదయం, మధ్యాహ్నం పూటలుగా కార్యాచరణ చేయాలన్నారు. జిల్లాలో గురువారం 55 శిబిరాలు నిర్వహించి 5,615 మందికి పరీక్షలు చేసినట్లు తెలిపారు. ఒక్కో శిబిరంలో రోజుకు కనీసం 150 మందికి పరీక్షలు చేసేలా జన సమీకరణ చేయాలన్నారు. కంటి వెలుగుపై ఆడియో సందేశంతో విస్తత ప్రచారం చేయాలన్నారు. శిబిరాల్లో రోజువారి కళ్ళద్దాల పంపిణీని తెలియపర్చి, వారికి కావాల్సిన ఇండెంట్ ను ముందస్తుగా సమర్పించాలన్నారు.
ప్రారంభోత్సవం విజయవంతంపై అభినందనలు
సమీకత జిల్లా కార్యాలయాల భవన సముదాయం ప్రారంభోత్సవం విజయవంతానికి కషో చెసిన అధికారులను కలెక్టర్ అభినందించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి అన్ని శాఖలు ఒకే గొడుగు కింద పనిచేస్తున్నట్లు చెప్పారు. ఒకరికొకరు సహకరిస్తూ బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. ఇంకనూ తరలింపు చేపట్టని కార్యాలయాలు వెంటనే ప్రక్రియ పూర్తి చేయాలని, నేటి నుండి కార్యాలయాలు క్రొత్త ప్రాంగణంలో నిర్వహించాలని ఆదేశించారు. సమయపాలన పాటించాలని, వంద శాతం సిబ్బంది హాజరును జిల్లా అధికారులు పర్యవేక్షణ చేయాలని అన్నారు. కాలపరిమితి దాటిన ఫైళ్లు, ఫర్నిచర్ ఖండం చేయాలని ఆయన తెలిపారు. కేటాయించిన స్థలంలోనే వాహనాల పార్కింగ్ చేయాలని అన్నారు. సముదాయంలో ఏర్పాటు చేసిన క్రేచే ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సముదాయంలో అన్ని రకాల వసతులు కల్పించినట్లు తెలిపారు. ఈ సమీక్ష లో అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్. మధుసూదన్, డిఆర్వో ఎన్. శిరీష, జిల్లా అధికారులు పాల్గొన్నారు.