Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం వరాలపై నగర ప్రజాప్రతినిధుల హర్షం
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
బీఆర్ఎస్ ఆవిర్భావ సభ విజయవంతం కావడంపై ఆ పార్టీ నగర ప్రజాప్రతినిధులు హర్షం వెలిబుచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివద్ధిని భారతదేశ వ్యాప్తంగా విస్తరించే దిశగా భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అడుగులు వేస్తుందని పేర్కొన్నారు. నగరాన్ని మరింతగా అభివద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిధులు కేటాయించడంపై కృతజ్ఞతలు తెలిపారు. వీడీవోస్ కాలనీలోని మంత్రి పువ్వాడ అజరు కుమార్ క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ విజరు కుమార్, కార్పొరేటర్లు కమర్తపు మురళి, జిల్లా నాయకులు ఆర్జేసీ కష్ణా, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న మాట్లాడారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు, రైతు ప్రతినిధులు హాజరుకావడం ఖమ్మం చరిత్రలో మరిచిపోలేనిదని, నేడు దేశ వ్యాప్తంగా ఖమ్మంపై చర్చ జరుగుతుందన్నారు. ఇది దేశ స్థితిగతులను మార్చిన సభ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతత్వంలో దేశ వ్యాప్త సంక్షేమం అందుతుందని, రానున్న రోజుల్లో ఢిల్లీ పీఠంపై గులాబీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. మంత్రులు పువ్వాడ అజరు కుమార్, హరీష్‌రావు నేతృత్వంలో సభ విజయవంతం అయిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఇదే స్ఫూర్తితో పార్టీ పిలుపు మేరకు ఖమ్మంలో ఏ సభలు పెట్టినా మంత్రి పువ్వాడ నాయకత్వంలో విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు. దేశంలో రైతు సర్కారే లక్ష్యంగా బీఆర్ఎస్ పనిచేస్తుందని అన్నారు. బిజెపి నిరంకుశ పాలనను ఎదుర్కోవడం ఒక భారత రాష్ట్ర సమితి, సీఎం కేసీఆర్ తో మాత్రమే సాధ్యమన్నారు. జిల్లాలోని 589 గ్రామాలకు ఒక్కో గ్రామానికి రూ.10 లక్షలు, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.50 కోట్లు, మున్సిపాలిటీలకు రూ.30 కోట్లు మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
తీగల వంతెన మంజూరుపై కేసీఅర్ కు క్షీరాభిషేకం
ఖమ్మం నగరాభివృద్ధిలో భాగంగా మంత్రి పువ్వాడ అజరుకుమార్ విజ్ఞప్తి మేరకు మున్నేరుపై తీగల వంతెన నిర్మాణం కోసం రూ. 180 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలన ఉత్తర్వులు జారీ చేయడం పట్ల బీఆర్ఎస్ నగర కమిటీ అధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు రాపర్తి శరత్, జ్యోతిరెడ్డి అయ్యపరెడ్డి, నాయకులు తోట రామారావు, పొన్నం వెంకటేశ్వర్లు, శంషుద్దీన్, ఆశ్రీఫ్, కిషోర్ బాబు, పాల్వంచ కృష్ణ, ఇస్సాక్, షకీన, భాస్కర్ రావు, శోభారాణి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.