Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని, జిల్లా కార్యదర్శి నున్నా
నవతెలంగాణ-వైరాటౌన్
నిబద్దత కలిగిన ఆదర్శ కమ్యూనిస్టు చిత్తారు నాగమ్మ ఆశయ సాధన కోసం కృషి చేయాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు పిలుపు ఇచ్చారు. గురువారం వైరా మున్సిపాలిటీ పరిధిలోని గండగలపాడు గ్రామంలో సిపిఐ (ఎం) మహిళా శాఖ సీనియర్ సభ్యురాలు, ఐద్వా నాయకురాలు చిత్తారు నాగమ్మ సంస్కరణ సభ మచ్చా మణి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు అమరజీవి కామ్రేడ్ చిత్తారు నాగమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడుతూ జీవితాంతం పార్టీ ఇచ్చిన కార్యక్రమానికి నికరంగా నిలబడి నిబద్ధతతో తుదిశ్వాస విడిచే వరకూ వరకు పని చేసిన ఆదర్శ కమ్యూనిస్టు చిత్తూరు నాగమ్మ అన్నారు. జీవితాంతం నిబద్ధతతో పనిచేసే గొప్పతనం కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతానికి ఉందన్నారు.బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా విస్తృతంగా ప్రజా ఉద్యమాలను నిర్మించడమే చిత్తూరు నాగమ్మకు మనం ఇచ్చే నిజమైన నివాళులని అలాంటి ముఖ్య కర్తవ్యం మనందరి ముందుందని అన్నారు. జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు మాట్లాడుతూ దోపిడీ, అసమానతలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్న కమ్యూనిస్టులను ప్రజలు బలపరచాలని, కమ్యూనిష్టుల అవసరం పేరుగుతున్న తరుణంలో చిత్తారు నాగమ్మ అనారోగ్యంతో మరణించడం చాలా దురదృష్టకరమని, పార్టీకి తీవ్ర నష్టమని అన్నారు. నేడు విలువలు లేని రాజకీయాలు నడుస్తున్నాయని, రాజకీయం అంటే అధికారం, పదవులని భావిస్తున్న తరుణంలో ఎర్రజెండా సైనికురాలిగా చిత్తారు నాగమ్మ జీవితకాలం పని చేశారని, వారి ఆశయాల సాధన కోసం మనం అందరం ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు, భుక్యా వీరభద్రం, చింతలచెరువు కోటేశ్వరరావు, మాచర్ల భారతి, వైరా పట్టణ, రూరల్, ఏన్కూర్ మండలం కార్యదర్శులు సుంకర సుధాకర్, తోట నాగేశ్వరరావు, దొంతెబొయిన నాగేశ్వరావు, సీనియర్ నాయకులు మల్లెంపాటి వీరభద్రరావు, కారేపల్లి సిపిఐ మండల కార్యదర్శి పుచ్చకాయల వెంకటేశ్వరరావు, దొంగల తిరపతిరావు, మెరుగు రమణ, మల్లెంపాటి రామారావు, గుమ్మా నరసింహారావు, గుడిమెట్ల రజిత, హరి వెంకటేశ్వరావు, గుడిమెట్ల మోహనరావు, పైడిపల్లి సాంబశివరావు, వాసిరెడ్డి విద్యాసాగర్ రావు, దేవబత్తిని నరసింహారావు, జడ్పిటిసి కోఆప్షన్ లాల్ మహమ్మద్, వైరా మార్కెట్ చైర్మన్ రత్నం, బిఆర్ఎస్ వైరా మండల అధ్యక్షులు భాణాల వెంకటేశ్వరావు, సర్పంచ్ తుమ్మల జాన్ పాపయ్య, కొణిదన కోటేశ్వరరావు, పారుపల్లి కష్ణారావు, బాజోజి రమణ, ఇమ్మడి సుధీర్, చిత్తారు సింహాద్రి, పుచ్చకాయల కష్ణయ్య, చిలకల రామనరసయ్య, తుషాకుల లింగయ్య, ఇమ్మడి రామారావు, ఇమ్మడి వీరభద్రం, చిత్తారు నాగమ్మ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు.