Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మంలో బుధవారం జరిగిన బిఆర్ఎస్ సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లాకు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రకటించడాన్ని ఎస్ఎఫ్ఐ స్వాగతిస్తుందని, కానీ ఈ జిల్లా సుదీర్ఘ కల అయిన యూనివర్శిటీని ప్రకటించకపోవడం దుర్మార్గం అని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు అన్నారు. గురువారం ఖమ్మంలోని సుందరయ్య భవన్లో సమావేశం జరిగింది.ఈ సమావేశంలో అయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ఉన్నత విద్యను సూమారు 60 వేల మంది చదువుతున్నారని, వీరికి యూనివర్శీటీలో ఏ అవసరాలు ఉన్నా వరంగల్ కాకతీయ యూనివర్శిటికీ వందల కిలోమీటరు పాటు ప్రయాణం చేస్తూ వందల రూపాయలు వెచ్చించి వెళ్లి వస్తుందన్నారు. అశ్వారావుపేట, భద్రాచలం చుట్టు పక్కల గ్రామీణ ప్రాంతాలకూ చెందిన విద్యార్థులు పరిస్థితి అత్యంత ఇబ్బంది కరంగా ఉందన్నారు. యూనివర్శిటీ జిల్లాలో ఏర్పాటు చేస్తే ఉన్నత విద్య మరింత మందికి అందుబాటులో ఉంటుందన్నారు. జిల్లా అధ్యక్షులు తుడుం ప్రవీణ్ మాట్లాడుతూ ఈ జిల్లా విద్యాభివృద్ధికి యూనివర్శిటీ కీలకం అని యూనివర్శిటి కోసం అందరితో ఐక్యపోరాటాలు చేస్తామని చెప్పారు. ప్రకటించిన ఇంజనీరింగ్ కళాశాల పక్రియ ప్రారంభించి అందుబాటులోకి తెవాలన్నారు. సమావేశంలో నగర కార్యదర్శి తరుణ్, నాయకులు సాయి, కొండలరావు, సాయి రాజేశ్, హనుమంతరావు, వీరశేఖర్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.