Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమాచార హక్కు చట్టం కమిషనర్
నవతెలంగాణ-భద్రాచలం
సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలు కోరిన సమాచారాన్ని సెక్షన్ 7(1) ద్వారా 30 రోజులలో అందించాల్సిన బాధ్యత ఆయా శాఖల అధికారులపై ఉందని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ డాక్టర్ గుగులోత్ శంకర్ నాయక్ తెలిపారు. శుక్రవారం ఐటీడీఏ సమావేశం మందిరం హాలులో సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం అడిగిన పౌరులకు, పౌర సమాచార అధికారులతో 56 సోకాజ్ కేసులు 17 జనరల్ నోటీసులకు సంబంధించిన కేసులను విచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం విధులు, పరిధిపై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాలనలో పారదర్శకత అధికార యంత్రాంగంలో జవాబుదారితనంతో ప్రజల కోరిన సమాచారాన్ని సకాలంలో ఇవ్వాలని, అలా సకాలంలో సమాచారం ఇవ్వనీ కారణంగా కమిషన్ నేరుగా ప్రజలు, ఆయా శాఖల పౌర సమాచార అధికారులతో ఐటీడీఏ కార్యాలయంలో కేసులను విచారణ ప్రక్రియ నిర్వహించి కోరిన సమాచారాన్ని అందజేసినట్లు చెప్పారు. సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజుల కాల వ్యవధిలో సమాచారం రాకపోతే మొదటి అప్పిల్ చేసుకోవడానికి ప్రజలకు అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది అని చెప్పారు. 30 రోజుల వ్యవధిలో సమాచారం ఇవ్వని సందర్భంగా 19(1) ప్రకారం మొదటి అప్పీల్ చేసుకుంటే మొదటి అప్పి లేట్ అధికారి సమాచారం విచారణ చేపట్టి ఇప్పించాల్సిన అవసరం ఉంది అప్పిలేట్ అథారిటీ సమస్య పరిష్కరించాలని తెలిపారు. అప్పిలేట్ అథారిటీ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టని పక్షంలో సెక్షన్ 19(3) కమిషనర్‌కి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఈ జాప్యాన్ని తొలగించాలని ప్రజల్లో చైతన్యం నింపేందుకు, 30 రోజుల కాలవ్యవధిలో సమాచారం ఇప్పించే విధంగా కమిషన్ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. శుక్రవారం జిల్లాకు సంబంధించిన 73 కేసుల విచారణ నిర్వహించి దరఖాస్తుదారులకు కోరిన సమాచారం అందజేసినట్లు తెలిపారు. పౌర సమాచార అధికారులు సెక్షన్4(1) బి ప్రకారం 17 అంశాలతో కూడిన సమాచారం ఏర్పాటు చేయాలని చెప్పారు. సెక్షన్4(1) బి నిర్వహణ వల్ల కార్యాలయ విధులు నిర్వహణ, కార్యాలయ సమగ్ర సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. సెక్షన్5(1), 5(2) ప్రకారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం 2005లో పౌర సమాచార అధికారి మొదటి అథారిటీ వారి పేర్లు ఫోన్ నెంబర్లు వివరాలతో అమలు బోర్డులు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. సెక్షన్4(1) తప్పనిసరిగా అలాగే ప్రతి పౌర సమాచార అధికారి సమాచార హక్కు చట్టం 2005 సమాచార రిజిస్టర్ 16 కాలాల కూడిన మొదటి అప్లై అథారిటీ 8 కూడిన రిజిస్టర్ ని మైంటైన్ చేయాలి పాటించాలి దాని ప్రకారం నిర్వహించాలని పౌర సమాచార అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో 500 పై చిలుకు కేసులు పరిష్కరించినట్లు వివరించారు. రాష్ట్రస్థాయిలో కమిషన్ 39 వేలు కేసులకు గాను 34 వేలు కేసులు పరిష్కరించడంలో కమిషన్ విజయవంతంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. సమాచార హక్కు చట్టాలపై ప్రజలను చైతన్యపరచుటలో మీడియా సహకారం అందించాలని ఆయన కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెవెన్యూ, పంచాయతీ రాజ్, మున్సిపాలిటీలు, అటవీ, విద్యాశాఖలకు సంబంధించి ఎక్కువ కేసులు వస్తున్నాయని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్, పరిపాలన అధికారి భీమ్ సమాచార హక్కు చట్టం కమిషనర్ డాక్టర్ గుగులోత్ శంకర్ నాయక్‌కు మర్యాదపూర్వకంగా కలిసి జిల్లాలోని ఐటీడీఏ పరిధిలోని గిరిజన మండలాలలో సమాచార హక్కు చట్టం పరిధి విధులపై సంబంధిత అధికారులకు అవగాహన కొరకు అవగాహన సదస్సులు నిర్వహించుటకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని ఆయన వివరించారు. అనంతరం షాకాజ్ నోటీసులకు సంబంధించిన కేసులు జనరల్ నోటీసులకు సంబంధించిన కేసులను ఒక్కొక్కరిని పిలిపించి వారి సమస్యలను విచారణ చేపట్టారు.