Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పది రోజుల్లో ఫొటోస్ సెమిలర్ ఎంట్రీస్ విచారణ పూర్తి చేస్తాం : కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-పాల్వంచ
ప్రత్యేక ఓటర్ నమోదు ప్రక్రియ పై చేపట్టిన చర్యలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్‌ను అభినందించారు. శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజు ఫోటోస్ సిమిలర్ ఎంట్రీస్, ఎన్నికల గురు కార్డులు పంపిణీ, జాతీయ ఓటర్ల దినోత్సవం, ఆధార్ లింకేజీ అంశాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొని, మాట్లాడారు. ఫొటోస్ సిమిలర్ ఎంట్రీస్ విచారణ ప్రక్రియను 10 రోజుల్లో పూర్తి చేస్తామని కలెక్టర్ అండ్ జిల్లా ఎన్నికల అధికారి అనుదీప్ తెలిపారు. జిల్లాలో మొదటి విడతలో 25242 ఎన్నికల గుర్తింపు కార్డులు పంపిణీ చేశామని, వాటిలో సూచించిన చిరునామాలో లేని కారణంగా 234 కార్డులు మిగిలిపోయినట్లు చెప్పారు. ఆయా మండలాల్లో క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి కార్డులు పంపిణీ చేయుటకు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. రెండో విడతలో 35,000 నూతన ఎపిక్ కార్డులు ఎన్నికల కార్యాలయం నుండి జిల్లాకు రావాల్సి ఉన్నదని రాగానే పంపిణీ చేయుటకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓటు హక్కు వినియోగం, ప్రలోభాలకు గురికాకుండా నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగం తదితర అంశాలపై పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులకు వ్యాసరచన, వక్రుత్వ, క్విజ్, పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఓటరు అవగా హన ర్యాలీ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయ డంతో పాటు నూతన ఓటర్లకు ఎపిక్ కార్డులు జారీ చేస్తామ ని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎన్నికల సెక్షన్ పర్యవేక్షకులు ఎంఏ రాజు, సిబ్బంది నవీన్ తదితరులు పాల్గొన్నారు.