Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి అధ్యక్షులు తన్నీరు
నవతెలంగాణ-కొత్తగూడెం
విద్యుత్‌ను బాధ్యతాయుతంగా వాడుకోవాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి అధ్యక్షులు తన్నీరు శ్రీరంగారావు అన్నారు. శుక్రవారం కొత్తగూడెంలో విద్యుత్ వినియోగదారులతో ముఖాముఖి నిర్వహిచారు. విద్యుత్ వినియోగంలో వస్తున్న సమస్యలు, అధిక బిల్లులు, ఇరత సమస్యల పరష్కారం కోసం వినియోగదారులతో అవగాహనా సదసుస్స నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్ధికి ఇరిగేషన్ ప్రాజెక్టుపై అనేక పెట్టుబడులు పెట్టిందన్నారు. దాని తరువాత విద్యుత్ సంస్థపై పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టిందని, ఇది ముఖ్యమైన వనరుగా గుర్తించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలో వినియోగ దారులకు మెరుగైన విద్యుత్ అందించేందుకు రూ.38 వేల కోట్లు వెచ్చించాయని తెలిపారు. యాదాద్రి, భద్రాద్రి, కేటిపీఎస్, రామగుండం తదితర ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తి కోసం రూ.45 వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. రైతంగానికి నాణ్యమైన విద్యుత్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందన్నారు. విద్యుత్ సరఫరాలో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినప్పుడు దానిని మరమత్తులు చేయాల్సిన బాధ్యత విద్యుత్ సంస్థ అధికారులపై ఉందన్నారు. వినియోగ దారుల నుండి ఎలాంటి రుసుము వసూలు చేయవద్దని చెప్పారు. వినియోగదారులకు అందించే హక్కులను వారికి అందే విధంగా విద్యుత్ సంస్థ అధికారులు చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఎండి. మనోహర్‌రాజు, ఫైనాన్స్ మెంబర్ బండారు కృష్ణయ్య, విద్యుత్ వినియోగ దారులు, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.