Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల ఐక్య వేదిక డిమాండ్
నవతెలంగాణ-అశ్వాపురం
మండల కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలని శుక్రవారం మండలంలో కూరపాటి చలపతి రావు అధ్యక్షతన జరిగిన మండల ఐక్యవేదికలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ కోసం వివిధ రాష్ట్రాల నుంచి పనుల కోసం వచ్చిన కార్మికులు, మండలంలో మారుమూల ప్రాంతాల నుండి వస్తున్న ప్రజలు పబ్లిక్ టాయిలెట్స్ లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మండలంలో ఆదివారం, సోమవారం రోజుల్లో వారపు సంతకి నిత్యావసర సరుకులు కోసం అనేకమంది జనం వస్తారన్నారు. మరుగుదొడ్ల సౌకర్యం లేక మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు తుళ్ళూరి ప్రకాష్ రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య, ఉప సర్పంచ్ భూక్యా చందు లాల్, బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు గద్దల రామకృష్ణ, ఆదివాసీ జేఏసీ మండల అధ్యక్షుడు పోడియం అనిల్ కుమార్, దావా వీరస్వామి, బీఎస్పీ జిల్లా నాయుకులు బాగవతపు సతీష్ యాదవ్, ఏఐటీయూసీ నాయుకులు ఎమ్ సురేందర్ రెడ్డి, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయుకులు ఇసంపల్లి కృష్ణ మాదిగ, తాడిపత్రి భరత్ కుమార్ రెడ్డి,మట్టా వీరభద్రారెడ్డి, రాయపూడి రాజేష్,సాయి, సతీష్,బొబ్బాల నాగేశ్వరరావు, గద్దల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.