Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
మండలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను జడ్పీటీసీ కామి రెడ్డి శ్రీలత శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ప్రాణప్రాయ స్థితిలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చికిత్సకు తగిన సహాయం బాధితులకు ఆందిస్తుందని ఆమె అన్నారు. నిరుపేదల సంక్షేమం కోసం పూర్తి భరోసా కాల్పిస్తుందని ఆమె అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వి నియోగం చేసుకోవాలని ఆమె అన్నారు. నకిరిపేటకు చెందిన ఆర్.వెంకటేశ్వర్లుకు రూ.26,000, సీహెచ్ నాగమ్మకు రూ.22,000, బూర్గంపాడుకు చెందిన వై.రాంబాబుకు రూ.51 వేయి, కె.పుల్లయ్యకు రూ.60 వేలు, ఎం.లక్ష్మమ్మకు రూ.51 వేలు, సంజీవరెడ్డిపాలెంకు చెందిన జి.శేషరత్నంకు రూ.60 వేలు, సారపాకకు చెందిన వెంకటరమణకు రూ.60 వేలు చెక్కులను అందజేశారు. అలాగే పాత సారపాక జి..వెంకట లక్ష్మికు రూ.41,500, కె.సుప్రియకు రూ.40 వేలు, గాంధీనగర్‌కు చెందిన దోరరు రాజుకు రూ.29 వేలు, ఇరవెండి కు చెందిన బి.కమలకు రూ.33 వేలు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, బూర్గంపాడు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, మండల ఉపాధ్యక్షుడు జక్కం సుబ్రహ్మణ్యం, మండల యూత్ ప్రెసిడెంట్ గోనెల నాని, సొసైటీ డైరెక్టర్ బొల్లు రవి, మాజీ ఎంపీటీసీ జక్కం సర్వేశ్వరరావు, సారపాక టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీను ప్రధాన కార్యదర్శి తిరుపతి ఏసోబు, పార్టీ మండల నాయ కులు చుక్కపల్లి బాలాజీ, చిరంజీవి భూక్యా కృష, శ్రీను, నాగేందర్, నకిరిపేట గ్రామ పెద్దలు శివ, బొల్లా వెంకన్న, నల్లమోతు సురేష్ తదితరులు పాల్గొన్నారు.