Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
గత రెండేళ్లుగా ట్రైబల్ వెల్ఫేర్ పీఎంహెచ్ హాస్టల్స్ లోపని చేస్తున్న ఔట్ సోర్సింగ్ వర్కర్స్కు జీతాలు రాక పోవడంతో గత 18 రోజులుగా ఐటీడీఏ, ఏటీడీఓ ఆఫీసు ముందు నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పధకం యూనియన్ (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి ఎస్హెచ్ సుల్తానా సంఘీభావంగా పాల్గొని ప్రసంగిస్తూ ఒక రంగ కార్మికులు సమ్మె చెస్తే మిగిలిన వారు మద్దతు తెలిపి కాపాడాలని కోరారు. వీరు చేస్తున్న సమ్మెకు పూర్తి మద్దతు ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు అబ్ధుల్ నబి, తాళ్లూరి కృష్ణలు మాట్లాడారు. సమ్మెలో ఈసం పద్మ, కుంజ జయ, తోలెం సుజాత, అనిత, విజయ భారతి, తాటి భారతి, రమణమ్మ, దీప, వర్స సుధ, ఈసం బద్రమ్మ, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.