Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాత బకాయి కింద జమ కట్టడం విచారకరం
- డీసీఎంఎస్ వైస్ చైర్మెన్ కొత్వాల
- బ్యాంకు అధికారులను నిలదీసిన కొత్వాల
- తిరిగి రైతు ఖాతాలో జమ చేసిన బ్యాంకు అధికారులు
నవతెలంగాణ-పాల్వంచ
రైతుల బాగోగుల కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు సాయాన్ని బ్యాంకు అధికారులు పాత బకాయి కింద జమ చేసుకోవడం విచారకరమని, ఆ విధంగా బ్యాంకులు చేపడితే ఆందోళనలు చేస్తామని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు హెచ్చరించారు. పాల్వంచ మండలం పరిధిలోని సోములగూడెం పంచాయతీ కమ్మరిగూడెం గ్రామ రైతులకు ఇటీవల మంజూరు అయినా రైతుబంధు పైకం యూనియన్ బ్యాంకులో ఉన్న ఖాతాలో జమ అయింది. రైతుబంధు పైకం కోసం రైతులు రోజు బ్యాంకు చుట్టూ తిరిగిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న విషయాన్ని రైతులు కొత్వాల దృష్టికి తీసుకెళ్లారు. విషయం విన్న వెంటనే స్పందించిన కొత్వాల శుక్రవారం యూనియన్ బ్యాంకుకు వెళ్లి మేనేజర్ శ్రీకాంత్, అసిస్టెంట్ మేనేజర్ శర్మ, ఫీల్డ్ ఆఫీసర్ నాగార్జునను నిలదీశారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ రైతుబంధు పెట్టుబడి సహాయాన్ని బ్యాంకులు అప్పుల్లో జమ చేసుకోవద్దని, సాక్షాత్తు రాష్ట్ర ఆర్థికమంత్రి హరీష్ రావు బ్యాంకు అధికారులను ఆదేశించినప్పటికీ, బాకీ కింద జమ చేసుకోవడం నక్కపై తాటిపండు పడిన చందంగా'' రైతుల పరిస్థితి తయారైందని అన్నారు. స్పందించిన యూనియన్ బ్యాంకు అధికారులు, రైతులకు ఖాతాల్లో జమ అయిన రైతు బంధు పైకాన్ని వెంటనే అందజేస్తామని, కొత్వాల సాక్షిగా పైకాన్ని అందజేశారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచులు భూక్య రవీందర్, బీఆర్ఎస్ నాయకులు ఎలికా వెంకట్రావు, సోయం రాజేష్, చర్చి పాస్టర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.