Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ అనుదీప్
- ఎంపికైన 46 మోడల్ పాఠశాలలు ప్రారంభానికి సిద్ధం చేయాలి
- రాష్ట్రంలోనే మన జిల్లా మోడల్‌గా ఉండాలి
నవతెలంగాణ-పాల్వంచ
మన ఊరు మనబడి పాఠశాలల మరమ్మత్తు పనుల్లో నాణ్యతను పాటించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. శుక్రవారం పాల్వంచలోని నూతన కలెక్టరేట్ భవనంలో మనఊరు మనబడి పాఠశాలల పనుల పురోగతిపై విద్య ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మోడల్ పాఠశాలలుగా ఎంపిక చేసిన 46 పాఠశాలలను ప్రారంభోత్పవానికి సిద్ధం చేయాలని చెప్పారు. పాఠశాలల మరమ్మత్తు పనులను ప్రధానోపాధ్యాయులు ఎంఈఓలు, ఏఓలు, నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన నాణ్యమైన విద్యనందించేందుకు త్వరితగతిన ఈ కార్యక్రమంలో ఎంపిక చేసి పాఠశాలలకు మరమ్మత్తు చేసి గ్రీనరీ లాన్ సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. 46 పాఠశాలలకు ప్రహారీ నిర్మించాల్సి ఉండగా ఇప్పటివరకు 28 పాఠశాలలో ప్రహరీ నిర్మాణాల పనులు పూర్తి అయ్యాయని మిగిలిన పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. మొదటి విడత ఎంపిక చేసిన 368 పాఠశాలల్లో 364 పాఠశాలల్లో పనులు ప్రారంభం అయ్యాయని పనులు వేగవంతం చేయించుకో వాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యా యులదేనని చెప్పారు. 59 లక్షల విలువల ఉపాధి హామీ పనులు తయారు చేశారని ఆ ప్రకారం పనులు వేగవం తంగా పూర్తి చేయుటకు చర్యలు చేపట్టాలని అన్నారు. ఉపాధ్యాయులు ఎంఈఓలు ఇంజ నీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేసిన పాఠశాలలో పనులు బాగా జరిగాయని అభినందించారు. కొత్తగూడెం మున్సి పాలిటీలో పలు పాఠశాలల్లో నత్తనడకన నడవడం పట్ల అసంపూర్తి వ్యక్తం చేశారు. ఈనెల 30వ తేదీన మరోసారి సమీక్ష నిర్వహి స్తామనని అప్పటివరకు మోడల్ పాఠశాలల ఫొటోలు వీడి యోలతో హాజరు కావాలని ఆదేశించారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో మన జిల్లా రాష్ట్రస్థా యిలో మోడల్‌గా ఉండాలని ఆయన చెప్పారు. అనంతరం మోడల్ పాఠశాలల ప్రగతిని ఆయన ఇంజనీ రింగ్ ప్రధానో పాధ్యాయులను ఎంఈఓలను అడిగి తెలుసు కుని పూర్తి చేయాల్సిన పనులకు దిశ నిర్ధేశంచశారు. డీఈఓ సోమశేఖరశర్మ, రోడ్లు భవనాలు పంచాయతీరాజ్, గిరిజన ఇంజనీరింగ్ ఐడీసీ ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు.