Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వాపురం
కంటి వెలుగు కేంద్రాలకు వచ్చేవారికి శ్రద్ధగా కంటి పరీక్షలు నిర్వహించి, వారి కంటి లోపాలను గుర్తించాలని ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు అన్నారు. శుక్రవారం మండలంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాలను ఆయన సందర్శించి, మాట్లాడారు. కేంద్రంలో కంటి పరీక్షలు నిర్వహిస్తున్న తీరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. కంటిలోని లోపాలను గుర్తిస్తున్న తీరుతెన్నులను అక్కడి వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కేంద్రాలకు ప్రతిరోజు ఎంతమంది వస్తున్నారు, వచ్చిన వారికి ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తూ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారన్న తీరుపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో కంటి సమస్యతో బాధపడుతున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టకుండా ఇచ్చిన టార్గెట్ను కచ్చితంగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. కేంద్రాలకు వచ్చే వారికి ఎటువంటి లోటుపాట్లు కలగకుండా స్థానిక అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఆయన వెంట ఐటీడీఏ డీడీటీడబ్ల్యూ ఆర్.రమాదేవి, తహశీల్దార్ వి.సురేష్ కుమార్, ఏటీడీఓ పి.నరసింహారావు, ఆర్ఐ నాగమణి ఉన్నారు.