Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విస్మరిస్తున్న అగ్నిమాపక నివారణా చర్యలు
- ప్రమాదం జరిగితే?
నవతెలంగాణ-అశ్వారావుపేట
ప్రమాదం ఏదీ చెప్పి రాదు. ప్రాణం చెప్పి పోదు. ఇవి రెండూ కాకతాళీయంగా సంభవించేవి కాబట్టే ముందస్తు అప్రమత్తతో వ్యవహరించాలి అనేది ప్రాధమిక జీవన సూత్రం. ఇది అందరికీ తెలిసిందే అయినా మనం ఆపదలో పెడుతున్నాం అనుకుంటేనే జాగ్రత్తలు తీసుకుంటాం. ఇంతలోనే జరగాల్సిన నష్టం జరిగితీరుతుంది. ప్రస్తుతం గోపాల్ రావు పేటలో బహుళ అంతస్తుల భవనంలో సంభవించిన అగ్నిప్రమాదం ప్రతీ పట్టణానికి గుణపాఠం అనే చెప్పుకోవాలి. రోజు రోజు కీ పెరిగిపోతున్న పట్టణీకరణలో బహుళ అంతస్తులు, సముదాయాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. కానీ నియమం నిబంధనలు మాత్రం అంతంత మాత్రమే అని చెప్పుకోవాలి. వాస్తు ప్రకారం ఏది ఎక్కడ ఉండాలి, ఏ గుమ్మం ఎటు వైపు ఉండాలనే నియమం తప్పక పాటిస్తాం. కానీ అగ్ని ప్రమాదం సంభవిస్తే ఈ నియమాలు ఏమీ పని చేయవని తెలిసినా అగ్నిమాపక నియమాలు మాత్రం గారికి వదిలేస్తాం.
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలో శరవేగంగా రియల్ ఎస్టేట్ వ్యాపార వృద్ధితో పాటు బహుళ అంతస్తుల, సముదాయాల సంస్కృతీ విస్తరిస్తోంది. మేజర్ పంచాయతీ అశ్వారావుపేటలో 54 గ్రౌండ్, జీ ప్లస్ ఒన్, జీ ప్లస్ టూ 45 మొత్తం 167 బహుళ భవన సముదాయాలు ఉన్నట్లు పంచాయతీ నివేదికలు తెలుపుతున్నాయి. అగ్నిమాపక నిబంధనలు ప్రకారం 18 మీటర్లు ఎత్తు పై బడిన 6 ఫ్లోర్ల నివాస సముదాయాలు, 18 మీటర్లు ఎత్తు పై బడిన 6 ఫ్లోర్ బహుళ అంతస్తుల భవనాలకు తప్పని సరిగా అగ్నిమాపక శాఖ నుండి ఎన్ఓసీ అనుమతి ఉండాలి. ఈ నిబంధనలు లోపు భవనాలకు అయినా కూడా ఒక వేళ అగ్నిప్రమాదం జరిగితే ఆ సముదాయాలు చుట్టూ అగ్నిమాపక శకటం తిరిగే వీలుగా 6 మీటర్లు వెడల్పును ఖాలీ స్థలం తప్పని సరిగా ఉండాలి. ప్రతీ సముదాయం లోనూ ఫైర్ సేఫ్టీకి అనుగుణంగా అగ్ని ప్రమాదాన్ని నివారించే నీటి సదుపాయం, మంటలు ఆర్పే పరికరాలు నిత్యం అందుబాటులో ఉండాలి. ఉంచే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులు తెలుపుతున్నారు.