Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ అనుదీప్
- నిధులు మంజూరుకు ప్రతిపాదనలు
- 2వ దశ దళితబంధు నియోజకవర్గానికి 500 యూనిట్లు
నవతెలంగాణ పాల్వంచ
దళితుల ఆర్ధిక సాధికారతే లక్ష్యంగా చేపట్టిన దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించు విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో దళితబంధు యూనిట్లు గ్రౌడింగ్, నిర్వహణ తదితర అంశాలపై నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనిట్లు నిర్వహణ ప్రక్రియను పర్యవేక్షణ చేస్తూ ప్రతి వారం నివేదికలు అందచేయాలని ఎంపీడీఓలను ఆదేశించారు. దళితుల సామాజిక ఆర్ధికాభివృద్ధికి సరికొత్త బాటలు వేసిన దళితబంధును లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. నిధులు మంజూరు చేయుటకు అవకాశం ఉన్న యూని ట్లుకు తక్షణమే నిధులు మంజూ రుకు ప్రతిపాదనలు పంపాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీని ఆదేశిం చారు. జిల్లాలో 461 యూనిట్లు గ్రౌండింగ్ చేశామని చెప్పారు. మండల, మున్సిపాల్టీలు వారిగా యూనిట్లు నిర్వహణ ప్రక్రియను నియోజకవర్గ దళితబంధు ప్రత్యేక అధికా రులను, ఎంపీడీఓలను, మున్సిపల్ కమిషనర్లును అడిగి తెలుసుకున్నారు. మంజూరు చేసిన నిధులు ప్రకారం యూనిట్లు నిర్వహణ లబ్దిదారుల ఆదాయ, వ్యయాల వివరాలపై నివేదికలు అందచేయాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రెండవ దశ దళితబంధు పథకంలో నియోజకవర్గానికి 500 యూనిట్లు ప్రకటించే అవకాశం ఉన్నందున అధికారులు సమాయత్తం కావాలని చెప్పారు. పాల ఉత్పత్తి యూనిట్లును పశుసంవర్ధక శాఖ అధికారులు పర్యవేక్షణ చేయాలని, పశువుల ఆరోగ్య పరిస్థితులు, పాల దిగుబడి తదితర అంశాలను కూలం కషంగా పరిశీలన చేయాలని ఆయన పేర్కొన్నారు. యూనిట్లు ఏర్పాటుకు నియమించిన సెక్టోరియల్ అధికారులు యూనిట్లు కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షణ చేయాలని చెప్పారు. మండలస్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీలు యూనిట్లు నిర్వహణ తీరును పర్యవేక్షణ చేస్తూ లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ముత్యం, దళితబంధు ప్రత్యేక పర్యవేక్షణ మరియు మైనార్టీ సంక్షేమ అధికారి సంజీవరావు, దళితబందు నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.