Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు
నవతెలంగాణ-పాల్వంచ
నేటి యువత స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాస్ చంద్రబోస్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని జీవించాలని తహశీల్దార్ రంగా ప్రసాద్ యువతకు పిలుపునిచ్చారు. సోమవారం సుభాస్ చంద్రబోస్ 126వ జయంతిని నేతాజీ యువజన సంఘం, జనతా పౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్వంచ తహశీల్దార్ రంగా ప్రసాద్ హాజరై నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పాలు, పండ్లు, రొట్టెలను తహసీల్దార్ రంగా ప్రసాద్, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ముక్కంటేశ్వర్ రావు, ఆర్.యమ్.ఓ డాక్టర్ సోమరాజు దొర, నేతాజీ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్.జె.కె.అహ్మద్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నేతాజీ యువజన సంఘం, జనతా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్.జె.కె. అహ్మద్, పాల్వంచ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల కొండలరావు, సంఘ సభ్యులు సయ్యద్ అక్బర్, యం.డి.అబ్దుల్ రజాక్, తదితరులు పాల్గొన్నారు.
పినపాక : నాకు రక్తాన్ని ఇవ్వండి.. నేను మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను అంటూ స్వతంత్ర భారతావని కోసం పోరాడిన కీర్తికిరీటం నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తోట గంగాధర్, ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ బృహస్పతి అన్నారు. సోమవారం ఈ బయ్యారం క్రాస్ రోడ్లో నేతాజీ జయంతిని నిర్వహించారు. నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రశ్నలు గంగాధర్ మాట్లాడారు. ప్రెస్ క్లబ్ తరఫున నేతాజీకి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కట్టా శ్రీను, రమేష్, కార్యదర్శి గంగాధర్ రెడ్డి, సారయ్య, శంకర్, లక్ష్మణ్, విజరు, మహిళా కార్యదర్శి శ్రీలత, నరేష్, వినరు, లవ కుమార్ తదితరులు పాల్గొన్నారు.