Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలువురు సంతాపం
నవతెలంగాణ-కొత్తగూడెం
సీనియర్ పాత్రికేయులు ఎలక్ట్రానిక్ మీడియా ఏబీఎన్ రిపోర్టర్‌గా సేవలందిస్తున్న కల్లూరి యతిరాజ్ కుమార్ (49) సోమవారం ఆకాలమరణం చెందారు. సోమవారం తెల్లవారు ఝామున చాతిలో నొప్పి రావడంతో అతన్ని సమీప ప్రయివేటు అసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కొత్తగూడెం ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. గుండె పోటుగా డాక్టర్స్ నిర్ధారించారు. లక్ష్మీదేవిపల్లి శ్రీనర్ కాలనీలో నివాసం ఉంటున్న ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. గత మూడు దశాబ్దాలుగా వివిధ ఛానల్స్‌లో రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన మృత దేహాన్ని వారి స్వగ్రామం జూలూరు పాడు మండలం గూడెపూడికి తరలించారు. కుమారుడు లండన్‌లో ఉన్నారని, అతను విదేశాల నుండి వచ్చిన తరువాత స్వగ్రామం గుండెపూడిలో అంతక్రియలు నిర్వహించడం జరుగుతుందని సమాచారం. జిల్లాకేంద్రంలోని పాత్రికేయులు దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఆదివారం రాత్రి వరకు పలువురు మిత్రులతో కలిసి ఉన్న ఆయన ఉదయం మృతి చెందడంతో షాక్‌కు గురయ్యారు.
విప్ రేగా కాంతారావు : రాజ్ కుమార్ ఆకస్మికంగా మరణం పట్ల విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించారు. సీనియర్ జర్నలిస్టుగా మీడియా రంగంలో తను అందించిన సేవలను కొనియాడారు.
జిల్లా కలెక్టర్ ఆనుదీప్ : రాజు మృతి పట్ల కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణానికి గల కారణాలను డిపిఆర్ఓను అడిగి తెలుసుకున్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఎంపీ నామా : మంచి మిత్రుడు, కొత్తగూడెం రిపోర్టర్ కల్లూరి రాజు ఇక మనకు లేరనే వార్తను జీర్ణించుకోలేక పోతున్నానని ఎంపీ నామా నాగేశ్వరారరావు సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి నాప్రగాఢ సానుభూతిని తెలిజేశారు.
సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సంతాపం : రాజ్‌కుమార్ ఆకాల మరణం పట్ల సీపీఐ(ఎం) జిల్లా కమిటీ తీవ్ర సంతాపం, వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు. సోమవారం రాజు మృతి వార్త తెలుసుకన్న నాయకులు ప్రభుత్వ అసుపత్రికి వెళ్లి బౌతికాయాన్ని సందర్శించారు. సీపీఐ(ఎం) అనుబంధ ప్రజా సంఘాలు సంతాపలు తెలిపారు.
పలువురి సంతాపం : రాజ్‌కుమార్ మృతి పట్ల కొత్తగూడెం మాజీ శాసనసభ్యులు జలగం వెంకట రావు తీవ్ర సంతాపం తెలిపారు. రాజు మృతి చెందా డనే వార్త తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందని జలగం తెలిపారు. రాజు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటు ఆదుకుంటామని అన్నారు.
ఏబీఎన్ రాజుకు సీపీఐ(ఎం) నివాళి
జూలురుపాడు : సీనియర్ జర్నలిస్ట్ రాజు మృతదేహానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పొతినేని సుదర్శన్, సీనియర్ నాయకులు కాసాని ఐలయ్య, పార్టీ భద్రాద్రి, ఖమ్మం జిల్లా కార్యదర్శిలు అన్నవరపు కనకయ్య, నున్న నాగేశ్వరరావు, జిల్లా, మండల నాయకులు పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ... అతి చిన్న వయసులో గుండెపోటు రావడం చాలా విచారకరమైనదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే రాజుకి ఇలా జరగడం వల్ల పార్టీ నాయకులు కార్యకర్తలు అంతా దిగ్భ్రాంతికి లోనయ్యమని అన్నారు. రజు మరణం యావత్ పత్రికలోకానీ తీరని లోటని అన్నారు. కమ్యూనిస్టు పార్టీ అభివృద్ధికి స్థానిక నాయకులకు సలహాలు, సూచనలు ఇచ్చేవారని ఇచ్చేవారని గుర్తు చేశారు. వారి కుటుంబానికి సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కమిటీ నుండి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అదేవిధంగా రాజ్ కుమార్ ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు రాళ్లమండి కృష్ణమూర్తి, మాజీ సీనియర్ జర్నలిస్టు వెలదండి ప్రసాద్, జర్నలిస్టు తోట శ్రీనివాసరావు, దేవి శ్రీనివాస్, కుశల్ నాయక్ సంతాపం ప్రకటించారు. సోమవారం స్వగ్రామంలో జూలూరుపాడు మండలం గుండెపూడి గ్రామంలో మృతదేహంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. సీనియర్ జర్నలిస్టుగా మీడియా రంగంలో తను అందించిన సేవలను కొనియాడారు.
మణుగూరు : ఏబీఎన్ సీనియర్ జర్నలిస్ట్ రాజ్ కుమార్ మృతికి విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు సంతాపం తెలిపారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో రాజ్‌కుమార్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. రాజ్‌కుమార్ గుండెపోటుతో మృతి చెందడం బాధాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించారు. సీనియర్ జర్నలిస్టుగా మీడియా రంగంలో తను అందించిన సేవలను కొనియాడారు.
పాల్వంచ : ఏబీఎన్ జర్నలిస్ట్ రాజు ఆకస్మిక మృతి పట్ల కలెక్టర్ అనుదీప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణానికి గల కారణాలను డీపీఆర్ఓను అడిగి తెలుసుకున్నారు.
సోమవారం తెల్లవారు జామున తీవ్రమైన గుండె నొప్పి రావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని, వైద్య చికిత్స తీసుకుంటూనే కుప్పకూలి పోయారని, అతని మరణం చాలా బాధాకరమని చెప్పారు. అందరితో ఎంతో కలివిడిగా ఉండేవారని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.