Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
భావ ప్రకటన స్వేచ్ఛ, రాజ్యాంగం కల్పించిన హక్కు అని పలువురు నాయకులు స్పష్టం చేశారు. సోమవారం స్థానిక బస్టాండ్ సెంటర్లో భావ ప్రకటన స్వేచ్ఛ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ వాదులు, నాస్తిక వాదులు, హేతువాదులు, టీచర్లు పైన జరుగుతున్న సామూహిక దాడులు మూక దాడులకు వ్యతిరేకంగా మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా మతోన్మాద దాడులకు బలైపోయిన పన్సారే, ద బోల్కర్, గౌరీ లంకేష్లకు నివాళులు అర్పించి అనంతరం భావ ప్రకటన స్వేచ్ఛ జేఏసీ రాష్ట్ర నాయకులు జీడి సారయ్య, ప్రముఖ హేతువాద నాస్తిక ఉద్యమ కారులు డాక్టర్ భాను ప్రసాద్, శాస్త్రీయ అధ్యయన వేదిక రాష్ట్ర కన్వీనర్ చారువాక, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు ఎల్.విశ్వనాథం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాస్తిక, హేతువాద, అంబేద్కర్ వాదులు, టీచర్ల పైన సామూహిక మూక దాడులు ఈ మధ్యకాలంలో ఎక్కువ చేసిందన్నారు. ఒక వర్గం ప్రజలు కావాలని ఇటువంటి వారిపైన దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీ నాయకులు రాసుద్దీన్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ టిపిఎఫ్ జిల్లా కన్వీనర్ మంతెన సంజీవరావు, హేతువాద సంఘం నాయకులు సుభాని, టీజేఎస్ నాయకులు భరత్, అంబేద్కర్ పూలే, యువజన సంఘం నాయకులు ప్రశాంత్, పీడిఎస్యూ నాయకులు మంజుల, సాంబ, కంపాటి పృథ్వి, సురేష్, ఎమ్మార్పీఎస్ నాయకులు మంతెన వసంతరావు ఎంఎస్పి నాయకులు డేవిడ్, గణేష్ శాస్త్రీయ అధ్యయన వేదిక జిల్లా నాయకులు భూక్య శివ, కోటేశ్వరరావు తెలంగాణ ఉద్యమకారులు తొగరు రాజశేఖర్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.