Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాన్యుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ అన్నారు.
ఖమ్మం జిల్లా నూతన ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ హాల్ లో సోమవారం జరిగిన తొలి ప్రజావాణి లో ముఖ్య అతిథిగా మంత్రి పువ్వాడ హాజరయ్యారు. దేశంలో ఎవరికి దక్కని అరుదైన గౌరవం మన ఖమ్మం జిల్లాకు దక్కడం చాలా గర్వంగా ఉందన్నారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి నలుగురు ముఖ్యమంత్రులు, ఒక మాజి ముఖ్యమంత్రి చేత మన కలెక్టరేట్ ప్రారంభించుకుని కలెక్టర్ వి.పి.గౌతమ్ ను తన సీట్ లో కూర్చోబెట్టిన అరుదైన, అద్భుతమైన గౌరవం ఇప్పటి వరకు దేశంలోనే ఎక్కడ జరగలేదన్నారు. ఇక జరగబోదని స్పష్టం చేశారు. ఆయా శాఖల అధికారులు పిర్యాదుదారులను తమ బిడ్డల వలె వారికి అందాల్సిన న్యాయం చేయాలని, మన తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సేవలు, ప్రభుత్వ పథకాలు, ఇతర పనులు చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దష్టికి ఎలా తీసుకువెళ్లాలో తెలియక సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులకు గురి అవుతుండేవారని, తెలంగాణ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం ఎప్పుడైతే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి, వారి సమస్యల్ని జిల్లా కలెక్టర్ అధ్వర్యంలో అన్ని శాఖల జిల్లా అధికారులు ఒకే వేదిక ద్వారా సామాన్యుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.ప్రభుత్వ విధి విధానాల అమలు, ప్రజలకు సరైన పాలన, క్షేత్ర స్థాయిలో సంక్షేమ పథకాలు అందని వారికి ప్రజావాణి ద్వారా అందించామన్నారు. అన్ని కార్యాలయాలు ఒకే సముదాయంలో ఉండటం వల్ల ప్రజల సమస్య ఒక్క దగ్గరే పరిష్కారం అవుతాయని, మరెక్కడికి వెళ్లాల్సిన పని లేదని, ప్రజల సౌకర్యార్థం ఖమ్మం నగరం నుండి జిల్లా కలెక్టరేట్ వరకు ఆర్టీసి సిటీ బస్సులను నడుపుతామని పేర్కొన్నారు. అనంతరం నూతన కలెక్టరేట్ లోకి మారి విధులు ప్రారంబించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్, అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.
సింగరాయపాలెం సాగు భూములకు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలి
మంత్రి అజరు, కలెక్టర్ గౌతమ్‌లకు రైతుల వినతి
కొణిజర్ల మండలం సింగరాయపాలెం గ్రామ రెవెన్యూ సాగు భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని సోమవారం నూతన కలెక్టర్ కార్యాలయం గ్రీవెన్స్‌లో జిల్లా మంత్రి పువ్వాడ అజరు కుమార్, జిల్లా కలెక్టర్ గౌతమ్‌లకు రైతులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ 1959 -60 సంవత్సరం నుంచి రైతుల స్వాధీనంలో ఉన్న సాగు భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు కాలేదన్నారు. 60 సంవత్సరాల నుంచి ప్రభుత్వ రెవెన్యూ పహాణిలలో ఉంటూ మీ పహాణిలో కూడా రైతులు ఉన్నా సాగు భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు కాలేదన్నారు. అని దీని వల్ల 200 మంది రైతులు 350 ఎకరాల విస్తీర్ణంలో రైతుబంధు, రైతుబీమా పథకాలకు నోచుకోవడం లేదని అన్నారు. సీలింగ్ చట్టం సందర్భంగా సింగరాయపాలెం 350 ఎకరాల రైతులకు జగిరిదార్ విక్రయం చేసినట్లు ధ్రువీకరణ చేశారని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో గ్రామ రైతులు దొడ్డపనేని కృష్ణార్జున్ రావు, బేగ్ రోషన్, కట్టా రాంబాబు, ఎస్ కె దాదా సాహెబ్, రాచ్చబంటి రామయ్య, తుమ్మలపల్లి మంగపతి తదితరులు పాల్గొన్నారు.