Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు
నవతెలంగాణ-తల్లాడ
కేంద్ర ప్రభుత్వం రైతు ఉద్యమానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని జనవరి 26న సంయుక్త కిసాన్ మోర్చా పిలుపుమేరకు దేశంలో జిల్లా కేంద్రాల్లో జరిగే రైతు ర్యాలీలను విజయవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు పిలుపునిచ్చారు. సోమవారం తల్లాడ మండలం కుర్నవల్లిలో మండల రైతు సంఘ కార్యదర్శి నందమూరి మోహన్ రావు అధ్యక్షతన తల్లాడ, కల్లూరు మండలాల రైతు సదస్సు నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ దేశంలో అన్నం పెట్టే రైతు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఎనిమిది సంవత్సరాల్లో నాలుగు లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ కార్పొరేటీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడం కోసం రైతులందరూ ఐక్యంగా పోరాడాలని అన్నారు. జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరే వరకు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు ఐక్యమత్యంతో పోరాడితే హామీలను నెరవేర్చు కోవచ్చ న్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు నున్న నాగేశ్వరరావు, తాతా భాస్కరరావు, నాయకులు సేలం పకీరమ్మ, శీలం సత్యనారాయణరెడ్డి, ముదిగొండ అంజయ్య, అయినాల రామలింగేశ్వరరావు, తన్నీరు కృష్ణార్జునరావు, మాదాల కృష్ణారావు, మాదాల వెంకటేశ్వరరావు, పులి వెంకట నరసయ్య, గండమాల ఆనందరావు, కళ్యాణపు కృష్ణయ్య, కొమ్మినేని ఆదినారాయణ, కట్ట దర్గయ్య, దూల జనార్ధన్, పేరసాని వెంకటయ్య, పాల్గొన్నారు.