Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
సిబిఎస్ఇ క్లస్టర్ క్రీడల్లో 'హార్వెస్ట్' విద్యార్థులు ఆల్‌రౌండ్ ప్రతిభ చూపారని, జాతీయ స్థాయి పోటీలకు పలువురు విద్యార్థినులు పాల్గొన్న ప్రతి పోటీలో 'హార్వెస్ట్' అగ్రశ్రేణి నైపుణ్యం సాధించారని హార్వెస్ట్' గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపల్ ఆర్.పార్వతీరెడ్డి తెలి పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతీయేటా దేశవ్యాప్తంగా విద్యార్థినీ, విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు నిర్వహించే 'క్లస్టర్స్ , సౌత్తోన్' క్రీడాపోటీల్లో, తమ విద్యాసంస్థల విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొని, ప్రావీణ్యం కనబరచి ఆల్‌రౌండర్స్‌గా నిలిచారని తెలిపారు. 2022-23 విద్యా సంవత్సరానికిగానూ, గత 2నెలలుగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారు. కబడ్డీ, వాలీబాల్, భో-ఖో, బాస్కెట్ బాల్, ఆర్చరీ, అథ్లెటిక్స్ పలు రకాల క్రీడలు సిబిఎస్ఇ బోర్డ్ వారు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జోన్ల వారీగా పలు రాష్ట్రాల్లో సిబిఎస్ఇ పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు పోటీలలో పాల్గొంటారని, తమ పాఠశాల నుండి 12వ తరగతి చదువుతున్న వైశాలి, బ్లెస్సీ జాతీయస్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపికవడం తమకెంతో గర్వకారణమన్నారు. వచ్చేనెల వారణాసిలో విద్యార్థినులు ఈ అథ్లెటిక్స్‌లో పాల్గొంటారని తెలిపారు. అదేవిధంగా గత డిసెంబర్ 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు హైదరాబాద్‌లో నిర్వహించిన సౌత్ జోన్ ఆర్చరీ విభాగంలో 'అస్నా' జాతీయ స్థాయికి ఎంపికయ్యారన్నారు. గత నవంబర్ 25 నుండి 27 వరకు నార్కెట్‌పల్లిలో నిర్వహించిన 'కబడ్డీ' పోటీల్లో బాలురు, బాలికల జట్లు తృతీయస్థానాన్ని కైవసం చేసుకున్నాయన్నారు. గత నవంబర్ 25 నుండి 27వ తేదీ వరకు హైద్రాబాద్‌లో నిర్వహించిన 'వాలీబాల్' పోటీల్లో బాలురు, బాలికల జట్లు ఉత్తమ ప్రతిభ కనబర్చార న్నారు. గత డిసెంబర్ 4 నుండి 6 వరకు రాజమండ్రిలో నిర్వహించిన ఖో-ఖో పోటీల్లో బాలురు, బాలికల జట్లు ప్రతిభ కన బర్చారన్నారు. నెల్లూరులో జరిగిన బాస్కె ట్‌బాల్ క్రీడలో బాలుర జట్టు పాల్గొని పలు బహుమతులు పొందారన్నారు. సోమ వారం కళాశాల ప్రాంగణంలో విద్యార్థినీ, విద్యార్థులను వారికి శిక్షణ ఇచ్చిన కోచ్, పియిటిలను అభినందించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని అభిలాషించారు.