Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ముగ్గురు మాస్టర్స్ క్రీడాకారులు
నవతెలంగాణ-కొత్తగూడెం
తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఇటీవల మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన 9వ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్ పోటీల్లో కొత్తగూడెం క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభకనబర్చి పథకాలు సాధించడమే కాకుండా జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పట్టణానికి చెందిన క్రీడాకారుడు సిహెచ్.నాగయ్య 800, 400, 200 మీటర్ల పరుగు పందెంలో మూడు స్వర్ణాలు, 4 ఇంటూ 100 రిలే పరుగు పందెంలో రజత పథకం సాధించాడు. బి.కృష్ణయ్య క్రీడాకారుడు 5 కిలోమీటర్ల నడక పోటీల్లో రజితం, పి.మోహన్ క్రీడాకారుడు 5 కిలోమీటర్ల, 1500 మీటర్ల పరుగు పందెంలో రజిత పథకం సాధించాడు.
ముగ్గురు క్రీడాకారులు ఫిబ్రవరి 15 నుంచి హర్యానా రాష్ట్రంలోని చెండిగడ్డలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అత్యుత్తమ ప్రతిభకనబర్చి రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించడమే కాకుండా జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్ పాషా, తోటి యువ, సీనియర్ క్రీడాకారులు, పట్టణ ప్రముఖులు వారికి అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయిలోనూ పథకాలు సాధించి కొత్తగూడెం క్రీడా ఖ్యాతిని, ప్రతిభను చాటాలని ఆకాంక్షించారు. వృద్యాప్యంలోనూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్న సీనియర్ క్రీడాకారులు నేటితరం యూవతకు ఆదర్శమని వారు పేర్కొన్నారు.