Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీనివాసరావు స్మారక స్తూపం ఆవిష్కరణలో పోతినేని
నవతెలంగాణ-చండ్రుగొండ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల ప్రజా సంపద దోపిడి కాబడుతుందని, దాన్ని రక్షించవలసిన బాధ్యత ప్రజలందరిపై ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినే సుదర్శన్ అన్నారు. సోమవారం చండ్రుగొండలో వంకాయలపాటి శ్రీనివాసరావు స్మారక స్థూపాన్ని పోతినేని సుదర్శన్, పార్టీ జెండాను సీనియర్ నాయకులు కాసాని ఐలయ్య ఆవిష్కరించారు, సీపీఐ(ఎం) ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కార్యదర్శులు నున్న నాగేశ్వరరావు, అన్నవరపు కనకయ్య, టీజెఎస్ రాష్ట్ర నాయకులు తాళ్లూరి వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ కొనకండ్ల వెంకటరెడ్డి, బీఆర్ఎస్, సీపీఐ వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మండల కార్యదర్శి ఐలూరి రామిరెడ్డి అధ్యక్షతన సంస్మరణ జరిగింది. ఈ సభలో సుదర్శన్ మాట్లాడుతూ పేదల సాగు భూమి ఉంటే వారి ఆకలికి తీరి సుఖమైన జీవనాన్ని గడుపుతారని గ్రహించి వారి చేత పోడు భూముల పోరాటం చేయించి సాధించి నేడు ప్రజల హృదయాల్లో శ్రీనివాసరావు నిలిచిపోయారన్నారు. ప్రభుత్వాలు బాధ్యత అంశాల నుంచి తప్పుకుంటున్నాయన్నారు. దేశానికి కమ్యూనిస్టుల అవసరం ఎంతైనా ఉందన్నారు. సమాజంలో అసమానతలు తొలగిపోయే వరకు ఉద్యమాలు నిర్వహించాలన్నారు. అప్పుడే అమరజీవి శ్రీనివాసరావుకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. పార్టీ సీనియర్ నాయకులు కాసాని ఐలయ్య మాట్లాడుతూ నిజాయితీ నిబద్ధతతో పని చేసి ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారు అన్నారు. భూమి, ఉద్యోగం లేక ప్రజలు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ప్రజలు చైతన్యమై తిరుగుబాటు వస్తే త్వరలోనే కమ్యూనిజం వస్తుందన్నారు. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ కూలికి వెళితే జీవనం గడిచే పేదలకు బ్రహ్మాండమైన సాగుభూమి సాధించి, జీవితాన్ని గడుపుతున్నారన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం మనమందరం పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు మాట్లాడుతూ నిత్యం ప్రజల్లో ఉండి ఉపాధి, భూమి సాధించి పేదలకు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లిక్కి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు కొండపల్లి శ్రీధర్, భూక్య రమేష్, అన్నవరపు సత్యనారాయణ, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గూగులోతు ధర్మ, జిల్లా కార్యదర్శి బానోతు నాగేశ్వరరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు దారా బాబు, మండల నాయకులు మాలోత్ బొజ్జ నాయక్, భూపతి శ్రీనివాసరావు, గాదె లింగయ్య, సీపీఐ జిల్లా నాయకులు మహమ్మద్ కాజా, గార్లపాటి రామనాథం, జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగ సీతారాములు, సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు చల్ల మల్ల విటల్, సీనియర్ నాయకులు మావిళ్ళ వెంకటేశ్వర్లు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గార్లపాటి పవన్, సీపీఐ(ఎం) జూలూరుపాడు ,అన్నపురెడ్డిపల్లి, సుజాతనగర్ కార్యదర్శులు యాసా నరేష్, జంగిలి వెంకటరత్నం, ఈర్ల రమేష్, చండ్రుగొండ ఉపసర్పంచ్ దెబ్బెందుల బాబురావు, సీపీఐ(ఎం) చండ్రుగొండ మండల కమిటీ సభ్యులు పెద్దెన్ని వేణు, విప్పర్ల పెద్ద వెంకటేశ్వర్లు, రామడుగు వెంకటాచారి, గాలి రామారావు, షేక్ నాగుల్ మీరా, అబ్దుల్ రెహమాన్, రాము, వివిధ పార్టీల రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.