Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ పాల్వంచ
మాగంటి వెంకటేశ్వరావు దాతృత్వాన్ని కలెక్టర్ అనుదీప్ అభినందించారు. వివరాల్లోకి వెళితే... ఇస్లావత్ కమల భర్త సీతారాములు జగ్గుతండా గ్రామం, పాల్వంచ మండలం నవంబర్ 7న 2022వ కలెక్టర్ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తన భర్త 16 ఏండ్ల క్రితం అనారోగ్యతో చనిపోయారని, తనకు పాప, బాబు ఉన్నారని, కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని, 2014 సంవత్సరంలో తన కుమారుడు ఇస్లావత్ సాయి పవన్ గుండెజబ్బుతో బాధపడుతుండగా రూ.3 లక్షలు అప్పు చేసి హైదరాబాద్ గ్లోబల్ ఆసుపత్రిలో గుండె ఆపరేషన్ చేయించానని, అప్పటి నుండి ప్రతినెల మందులకు రూ.3 వేలు ఖర్చవుతున్నాయని, తన కుటుంబ ఆర్ధిక పరిస్థితి బాగాలేనందున తన కుమారుడికి ప్రతి నెల మందులు కొనలేని పరిస్థితిలో ఉన్నానని, మందులకు ఆర్థిక సాయం చేయాలని చేసిన వినతికి స్పందించిన కలెక్టర్ అనుదీప్ దాతల సహకారం తీసుకోవాలని పర్యవేక్షకులు శర్మకు సూచించారు. కలెక్టర్ సూచనల మేరకు మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఫౌండర్, ప్రెసిడెంట్ అయిన మాగంటి వెంకటేశ్వరరావు ముందుకు వచ్చి బాలునికి ఐదు నెలలకు సరిపడా మందులు అందచేయడంతో పాటు మరో 5 నెలలకు మందులు ఇస్తానని చెప్పడం పట్ల జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో శర్మ తదితరులు పాల్గొన్నారు.