Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్జిని మర్యాద పూర్వకంగా కలిసిన డీఎంఅండ్ హెచ్ఓ
నవతెలంగాణ-కొత్తగూడెం
జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ జెవిఎల్.శిరీష మంగళవారం జిల్లా జడ్జి పి.చంద్రశేఖర్ ప్రసాద్ని మర్యాపూర్వంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేశారు. శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు స్క్రీనింగ్ కార్యక్రమం కోర్టు ఆవరణలో నిర్వహించేందు అనుమతులు ఇవ్వాలని, స్థలాన్ని కేటాయించాలని, వైద్య ఆరోగ్యశాఖలో పీసి అండ్ పిఎన్డిటి యాక్ట్ గురించి చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి చంద్రశేఖర ప్రసాద్ మాట్లాడుతూ వైద్యశాఖ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ ఆరోగ్య కార్యయక్రమాల గురించి చర్చించారు. కరోనా ప్రికాషనరీ డోస్ నూరుశాతం పూర్తిచేసి ప్రభుత్వ లక్ష్యాన్ని అధిగమించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ ఎండి.ఫైజ్ మొయిద్దీన్, హెల్త్ ఎడ్యూకేటర్ టి.విజయకుమార్, కోర్టు అడ్మినిస్ట్రేట్ఆఫీసర్ అనిత, తదితరులు పాల్గొన్నారు.