Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వాపురం
ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలివ్లాని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో వ్యకాస మండల కమిటీ సమావేశం బొడ్డు రాములు అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ మండలంలోని నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి నేటికీ ఇండ్లు కట్టించి ఇవ్వకుండా పేదలను మోసం చేసిందన్నారు. అలాగే పోడుభూమలకు దరఖాస్తులను పరిశీలించి సర్వే చేసి ప్రతి పోడు రైతుకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో వ్యకాస మండల కార్యదర్శి మోకాళ్ళ రమేష్, కారం భీమయ్య, మడకం శంకర్ తదితరులు పాల్గొన్నారు.