Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు సమస్యలు లేవనెత్తిన ప్రజా ప్రతినిధులు
- సోషల్ మీడియా అత్యుత్సాహం పై తహశీల్దార్ ఆవేదన
నవతెలంగాణ-అశ్వారావుపేట
ప్రతీ మూడు నెలలకు నిర్వహించే మండల పరిషత్ సర్వ సభ్య సమావేశాలు సరా మామూలుగానే జరుగుతున్నాయని సభ్యులుగా మేము మా మొర వినిపించడంమే తప్ప ఎవరూ పట్టించుకోవడం లేదని పలువురు ఎంపీటీసీలు ఆవేదన చెందారు. స్థానిక మండల పరిషత్ సమావేశ ప్రాంగణంలో మంగళవారం ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించిన సర్వ సభ్య సమావేశంలో విద్యాశాఖ అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని, ఇప్పటికే రెండు పవర్ డేలు పూర్తి అయినా విద్యుత్ సమస్యలు పరిష్కారం కాలేదని వైస్‌ఎంపీపీ ఫణీంద్ర సభ దృష్టికి తెచ్చారు. మంచినీటి ట్యాంకులు అలంకార ప్రాయంగా ఉన్నాయని నిర్మించి ఏండ్లు గడుస్తున్నా మంచినీరు సరఫరా ఎండమావిలా ఉందని కావడిగుండ్ల సర్పంచ్ భూ లక్ష్మి, ఎంపీటీసీ బుచ్చి రాజు ఆవేదన వ్యక్తం చేసారు. మట్టి సరఫరా పై కో-ఆప్షన్ సభ్యులు పాషా లేవనెత్తిన అంశం పై సంబంధిత అధికారులు అభ్యర్ధన మేరకు కొన్ని పనులు జరుగుతుంటాయి అని కానీ సోషల్ మీడియా ఆగడాలు మాత్రం ఏది చేయాలన్నా తలనొప్పిగా మారాయని ఆవేదన వ్యక్తం చేసారు. ఏసీడీ పేరుతో విద్యుత్ శాఖ వినియోగదారుల పై అదనపు భారం వేస్తుందని పాషా సభ దృష్టికి తెచ్చారు. ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం వెనుక, పాపిడి గూడెం రోడ్డులో ఎప్పటి నుండో వినియోగంలో ఉన్న స్మశాన వాటికలను పునరుద్ధరించాలని సభ్యులు కోరిన అంశం పై తీర్మానం చేసారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వరలక్ష్మి, ఎండీఓ విద్యాధర రావు, ఐటీడీఏ ఏఈ ప్రసాద్ రావు, పీఆర్ ఏఈ శ్రీధర్, ఆర్అండ్బీ ఏఈ శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.