Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
నియోజకవర్గంలో అభివద్ధి చేయలేదంటూ, రకరకాల విమర్శలు ఆరోపణలు ఇటీ వల జరిగిన సభల్లో ఎమ్మెల్యే హరిప్రియ, టీబీజీకేఎస్ నేతలు చేశారని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎంపీటీసీలు మండల రాము, పాయం కృష్ణ ప్రసాద్, పూనెం సురేందర్, మాజీ రైతు సమితి అధ్యక్షులు సువర్ణపాక సత్యనారాయణ, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తాటి బిక్షం,మాజీ ఆత్మ కమిటీ ఛైర్మెన్ మూతి కృష్ణ, ఇందిరా నగర్ ఉప సర్పంచ్ ఎల్లయ్య, నాయకులు మడుగు సాంబమూర్తి, బోళ్ళ సూర్యం తెలిపారు. స్థానిక జడ్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్యలపై విమర్శలు చేయడం సరికాదన్నారు. కోరం కనకయ్య ఎమ్మెల్యేగా గెలుపొంది నియోజక అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారన్నారు. 2014 ఎన్నికల సమయానికి నియోజక వర్గంలో అట్టడుగున ఉన్న బీఆర్ఎస్ ఓటు బ్యాంకును 2018 ఎన్నికల నాటికి 60వేల పైచిలుకు బలమైన ఓటు బ్యాంకుగా మలిచిన ఘనత కోరం కనకయ్య కే దక్కిందన్నారు. జెడ్పీ నిధులతో జిల్లాలోని వివిధ మారుమూల ప్రాంతాలతో పాటుగా ఇల్లందు నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఇక చేసేదేమీ లేక రాబోవు రోజుల్లో వీరి రాజకీయ ఉనికిని కాపాడుకోవటం కోసమే అర్థరహిత ఆరోపణలను చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో గుగ్లోత్ నాగార్జున, ఎల్లయ్య, బండి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.