Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంబరాలు చేసిన అభిమానులు
- బాణసంచా, మేళతాళాల నడుమ స్వాగతం
- సుమారు ఏడు వేలమందికి అన్నదానం
- వేడుకలకు హాజరైన మంత్రి పువ్వాడ
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు ఖమ్మంలో మంగళవారం వేడుకగా నిర్వహించారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం ఖమ్మం చేరుకున్న ఆయనకు వందల మంది యువకులు బాణసంచా కాలుస్తూ.. బ్యాండ్ మేళాల చప్పళ్లు, కేరింతలతో అపూర్వ స్వాగతం పలికారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల నలుమూలల నుంచి రవిచంద్ర బంధుమిత్రులు, బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాషులు వేల సంఖ్యలో తరలివచ్చారు. మంత్రి అజయ్, ఎంపీ రవిచంద్రలు కేక్ లు కట్ చేశారు. ఎంపీ వద్దిరాజుకు జెడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు, మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్, సుడా ఛైర్మన్ బచ్చు విజయ్ కుమార్, బీఆర్ఎస్ ఖమ్మం నగర శాఖ అధ్యక్షుడు పగడాల నాగరాజు, బీఆర్ఎస్ నాయకులు శాఖమూరి రమేష్, గుండ్లపల్లి శేషగిరిరావు, జల్లెల శ్రీనివాస్ యాదవ్, మున్నూరుకాపు ప్రముఖులు పారా నాగేశ్వరరావు, ఆకుల గాంధీ, పొదిల రవికుమార్, శెట్టి రంగారావు, తోట రామారావు, పాల్వంచ రామారావు, తీగల విజరు, రాపర్తి రాజా, గణేష్, మాటేటి రవి, యువ నాయకులు చిరంజీవి, భానుప్రతాప్, గౌరిశెట్టి వినోద్, నలబాల హరీష్, గుమ్మడెల్లి ప్రశాంత్,హరీష్, ఆకుల సాయి, దోసపాటి కిరణ్, అరుణ్ నాయక్ తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు కార్పొరేటర్లు, పాత్రికేయులు, పోలీసు అధికారులు, న్యాయవాదులు, మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికులు, బౌన్సర్స్, హీజ్రాలు రవిచంద్రకు హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు. వేద పండితులు ఆశీస్సులు ఇచ్చారు.