Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తండాల్లో పర్యటించిన గిరిజన సంఘం
నవతెలంగాణ-కారేపల్లి
నిధులు లేక గ్రామపంచాయతీలలో సమస్యలు తిష్టవేశాయని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. కారేపల్లి మండలంలో మంగళవారం తండాలలో సమస్యలపై సర్వే నిర్వహించారు. విశ్వనాధపల్లి, భాగ్యనగర్తండా, సూర్యతండా, బీక్యాతండా గ్రామాల్లో సర్పంచ్లు హలావత్ ఇందిరాజ్యోతి, బానోత్ బన్సీలాల్, స్ధానిక గిరిజన సంఘం నాయకులతో కలిసి పర్యటించారు. ఈసందర్బంగా గ్రామాల్లో పలు సమస్యలను గిరిజనులు నాయకుల దృష్టికి తీసుకవచ్చారు. ఈసందర్భంగా భూక్యా వీరభధ్రం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రాల నిధులు పంచాయతీలకు అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిధులు దారి మళ్లింపు సరైన చర్య కాదన్నారు. సర్పంచ్ల పరిధికాని సమస్యలను అధికారులు స్పందించి పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఖమ్మం జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు, పోడు సాగుకు జాప్యం లేకుండా హక్కు పత్రాలు ఇవ్వాలని, నిరుద్యోగులకు ట్రైకార్ రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణ గిరిజన సంఘం జిల్లా మహాసభలు ఫిబ్రవరి మాసంలో కారేపల్లిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో గిరిజన సంఘ నాయకులు భూక్య అశోక్ కుమార్, బానోత్ కొండయ్య, రమేష్, భూక్య తోపియా, గూగులోత్ బన్సీలాల్ పాల్గొన్నారు.