Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 104 డ్రైవర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కే.శంకర్
- కలెక్టర్ అనుదీప్‌కు ఫిర్యాదు
నవతెలంగాణ-పాల్వంచ
జీతాలు ఇవ్వమంటే మా జీవితాలతో ఆడుకుంటున్నారని, 104 డ్రైవర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ అనుదీప్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 104 ఉద్యోగులు జీతాల బడ్జెట్ డీఎంహెచ్ఓ అకౌంట్లో ఒక కోటి 80 లక్షలు ఉంచుకుని, నాలుగు నెలల నుండి జీతాలు వేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. జీతాలు వేయమని అడిగితే మీరు వెళ్లి ప్రొసీడింగ్ తెచ్చుకోండి అని అక్కడ ఉన్న సెక్షన్ క్లర్క్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని అన్నారు. మరొకసారి ఈ విధముగా ఆఫీసుకు వచ్చి అడిగితే దూరంగా డిప్యూటేషన్ వేస్తానని ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి జీతాలు అడిగినందుకు, మా పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు, బడ్జెట్ లేదు అని పై అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించినందుకు గాను, సదరు సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ ఎం.శ్రీకాంత్ పైన తగినటువంటి చర్యలు తీసుకుని విధుల నుండి తొలగించి వెంటనే మాకు జీతాలు ఇప్పించగలర, నిన్యాయం చేయాలని 104 జిల్లా ఉద్యోగుల తరఫున కలెక్టర్‌కు తెలిపారు.