Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో 2వ రోజు బీసీ రిజర్వేషన్లకు పెంపుటకు మద్దతుగా కోటి సంతకాల సేకరణ ఇల్లందులోని జగదాంబ సెంటర్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఎస్పీ ఇల్లందు నియోజకవర్గ అధ్యక్షులు బాదావత్ ప్రతాప్ మాట్లాడుతూ.. దేశ జనాభాలో బీసీల శాతం 52శాతం కంటే ఎక్కువగా ఉన్నారని, కావున బీసీలకు 52శాతం రిజర్వేషన్లు పెంచాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే బీసీ కుల గణన చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మూడు రోజులపాటు జరుగుతుంది అన్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఇదే కార్యక్రమంను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లేతాకుల కాంతారావు, జిల్లా నాయకులు రాయల శ్రీనివాసరావు, పప్పుల గోపీనాథ్, నియోజకవర్గ ఇన్చార్జ్ తచ్చడి సత్యనారాయణ, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, నియోజకవర్గం కన్వీనర్ జ్ఞాన సుందరం, బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు.